ఆనాటి హీరోయిన్ భానుప్రియ చెల్లెలు అందరికీ సుపరిచితమే. ఇక ఈమె పేరు శాంతిప్రియ. ఈమె 1987వ సంవత్సరంలో తమిళ చిత్రం ఎంగ ఓరు పట్టు కారన్ అనే సినిమా ద్వారా మొదటిసారిగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శాంతి ప్రియ. తన అక్క భానుప్రియ లాగే అందం అభినయంతో ప్రేక్షకులను అలరించింది.. ముఖ్యంగా భానుప్రియ కు ఎంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ అంతే స్థాయిలో శాంతిప్రియ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.. ఈమె అప్పట్లో గ్లామర్ హీరోయిన్గా కూడా మంచి గుర్తింపు పొందింది.

తెలుగులో ప్రముఖ దర్శకుడు వంశీతో కలిసి నటుడు తనికెళ్ల భరణి రచన లో సహాయం చేశారు. మహర్షి రాఘవ హీరోగా తెరకెక్కిన నుంచి వంశీ మహర్షి అనే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ కాలంలో లవ్ కథా చిత్రాలు వచ్చిన సినిమాలలో ఈ సినిమా హైలెట్ గా నిలిచింది..ఇక ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ కూడా ఎవర్గ్రీన్ గా ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఒకే సంవత్సరంలో తమిళంలో ఏకంగా ఏడు చిత్రాలలో నటించి, కృష్ణంరాజు జగపతిబాబు కలిసి నటించిన సింహస్వప్నం సినిమా ద్వారా తెలుగులోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత తెలుగులో ఈమె  కర్తకన్నీరు, యమపాశం, జస్టీస్ రుద్రమదేవి వంటి కొన్ని చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ నటించిన `సౌగంధ్` సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. మెహెర్బాన్ , మేరే సజనా సాథ్ నిభానా, ఎక్కేపే ఎక్కా, పూల్ ఔర్ అంగార్ వంటి చిత్రాల్లో నటించింది. 1999లో  మరాఠీ , హిందీ చిత్రాలలో మంచి  నటుడుగా గుర్తింపు పొందిన  సిద్ధార్ధ్ రాయ్ ని వివాహం చేసుకుని సినిమా ఇండస్ట్రీ కు గుడ్ బై చెప్పేసింది. తర్వాత దూరదర్శన్లో ప్రసారమయ్యే కొన్ని ఆధ్యాత్మిక సీరియల్స్లో కూడా నటించి ఇక పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరమైంది.


అయితే ఇప్పుడు మరీ వెబ్ సిరీస్ ద్వారా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. జీ స్టూడియోస్ కి సంబంధించిన Mx ప్లేయర్ కోసం.. శాంతి ప్రియ  ఓ వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్రలో నటించేందుకు సిద్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: