ఫీల్ గుడ్ మూవీస్ అందించడంలో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. కెరీర్ మొదటి నుంచి కూడా ఇలాంటి సినిమాలను చేస్తూ యూత్ ను విశేషంగా ఆకట్టుకున్నారు. అలా ఆయన చేతి నుంచి జాలు వారిన ఆణిముత్యాలే 'హ్యాపీ డేస్, ఫిదా'.
 సామాన్యుల జీవితాల్లోని సరదాలను ఎమోషన్స్ ను చూపిస్తూనే వారి కష్టాలను కూడా కళ్ళకు కడతాడు. అందుకే ఆయన సినిమా ఖచ్చితంగా హిట్. తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా 'లవ్ స్టోరీ' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందింది. ఈ సినిమాకు సంబంధించిన పాటలు, ట్రైలర్ అన్ని సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ ఏడాది ఏప్రిల్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా ఈ రోజు అంటే సెప్టెంబర్ 24న విడుదలైంది. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో, భారీ రేంజ్ లో విడుదలైన 'లవ్ స్టోరీ' సినిమా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. గత రాత్రి యూఎస్ లో సినిమా ప్రిమియర్ కావడంతో, అక్కడ మూవీని చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు.

ట్విట్టర్ టాక్ ప్రకారం... 'లవ్ స్టోరీ' ప్రేక్షకుల అంచనాలను అందుకుంటూ శేఖర్ కమ్ముల రాసిన కథ గ్రిప్పింగ్ గా ఉందని, ప్రథమార్థం ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సాగగా, సెకండాఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉందని టాక్ వస్తోంది. సినిమాకు సాయి పల్లవి నాగచైతన్య నటన, సాయి పల్లవి డాన్స్, మ్యూజిక్ హైలెట్ అంటున్నారు. సినిమాలో ఎప్పటిలాగే శేఖర్ కమ్ముల మార్క్ కనిపించిందని, సినిమా పక్క బ్లాక్ బస్టర్ అని అభిప్రాయపడుతున్నారు. కొంతమంది మాత్రం రొటీన్ ఫ్యామిలీ డ్రామా అంటూ పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతానికి ట్విట్టర్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: