నందమూరి నటసింహం బాలకృష్ణ అంటే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. అప్పట్లో ఆయన చేసిన సినిమాల్లోని యాక్షన్ సన్నివేశాలు విశేషంగా అలరించాయి. అలా బాలకృష్ణ హీరోగా నటించిన ఫ్యాక్షన్ మూవీ 'చెన్నకేశవ రెడ్డి' విడుదలై నేటితో 19 ఏళ్లు పూర్తవుతోంది. అప్పట్లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బాలకృష్ణ మూడవ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా 'చెన్నకేశవ రెడ్డి'లో నటించారు. ఈ సినిమా మా 2002 సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. చెన్నకేశవ రెడ్డి అనే తండ్రి పాత్రలో, భరత్ అనే కొడుకు పాత్రలో బాలకృష్ణ కనిపించగా శ్రియ, టబు హీరోయిన్లుగా, పృథ్వీరాజ్, దేవయాని, చలపతిరావు, బ్రహ్మానందం, అలీ, అన్నపూర్ణ, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. 'ఆది' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిర్మాత దర్శక ద్వయం వివి వినాయక్, బెల్లంకొండ సురేష్ కాంబోలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఫ్యాక్షన్ చిత్రాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో చెన్నకేశవరెడ్డి అనే స్థానిక నాయకుడిని అతని ప్రత్యర్థులు ఓ కేసులో ఇరికించి సంవత్సరాల తరబడి జైల్లో ఉండేలా చేస్తారు. ఈ చర్యలన్నీ ఇంటికి భయపడిన ఆయన శ్రేయోభిలాషులు, సన్నిహితులు చెన్నకేశవరెడ్డి కొడుకైనా భరత్ ను రాయలసీమ కు దూరంగా ఉంచి పెంచుతారు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలైన చెన్నకేశవ రెడ్డి రాయలసీమలో ఆధిపత్యం చెలాయిస్తాడు. ఆ సమయంలోనే అతని కొడుకైన ఇన్స్పెక్టర్ భరత్ ను రాయలసీమకు పంపిస్తుంది ప్రభుత్వం. గతం గురించి తెలియని కొడుకు భరత్, చెన్నకేశవ రెడ్డి మధ్య పోరాటం జరుగుతుంది. చివరకు విషయం తెలుసుకున్న తండ్రికొడుకులిద్దరూ కలిసి విలన్ల భరతం పడతారు.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత సారధ్యం వహించిన ఈ సినిమా సాంగ్స్ అప్పట్లో శ్రోతలను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. అయితే ఆయన అంతకుముందే నటించిన 'సమరసింహారెడ్డి, నరసింహనాయుడు' అంత ఈ సినిమా హిట్ కాకపోయినప్పటికీ కమర్షియల్ గా మాత్రం మంచి సక్సెస్ సాధించింది. అప్పట్లో ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసిన విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: