సినిమాలో ఏముందో  సినిమానే చెబుతుంది. మ‌న‌సులో మాట‌లు ఏమ‌యినా ఉంటే అవి శేఖ‌ర్ చెబుతాడు. ఆయ‌న సినిమాల‌కు పెద్ద పెద్ద హీరోలు అక్క‌ర్లేదు. ఎందుకంటే ప్ర‌తి సినిమాలోనూ ఆయ‌నే హీరో! అయితే తెర‌పై క‌నిపించ‌రు. కొద్ది పాటి డ‌బ్బుల‌తోనే ఆనంద్ తీశాడు. కొన్ని అప్పులు కూడా ఉన్నాయి అప్ప‌టికీ. నేష‌న‌ల్ ఫిల్మ్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ కాస్త సాయం చేసింది అ ప్ప‌ట్లో!సినిమా విడుద‌ల‌య్యాక మంచి కాఫీ లాంటి సినిమా అన్నాడు క‌దా అందుక‌ని బ్రూ కాఫీ ఫౌడ‌ర్ త‌యారీ దారు హిందూ స్థాన్ లీవ‌ర్ లిమిటెడ్ త‌మ బ్రాండ్ ను సినిమా ద్వారా ప్ర‌మోట్ చేసింది. 


ఆనంద్ త‌రువా గోదావ‌రి సినిమాకు మాత్రం మంచి సపోర్టు ఉంది నిర్మాత నుంచి, ఈ సారి ఆయ‌న పాట‌లానే సినిమా కూడా మ‌న‌సా గెలుపు నీదే క‌దా అని వినిపించింది. హ్యాపీడేస్ కుర్రకారును ఉర్రూతలూగించింది. వ‌న‌మాలి రాసిన ఒక్క  పాటే కొన్ని ఏళ్ల పాటు ప్లే లిస్టులో ఉండిపోయింది. కార్తీక్ పాడిన ఈ పాట అరెరె అరెరె మ‌న‌సే జారే అంటూ సాగుతుంది. శేఖ‌ర్ సినిమా అప్ప‌టి నుంచి ఇప్ప‌టిదాకా మంచి పాట‌లు, శుద్ధ సంప్ర‌దాయ సంగీత నేప‌థ్యం ఇవ‌న్నీ మిస్ చేసుకోకుండా ఉంటుంది. మ‌న జీవితాల్లో వ‌చ్చే సంఘ‌ర్ష‌ణ‌లు ఏమ‌యినా అవి ఆయ‌న సినిమాల్లో నూ ఉంటాయి. అవి దాటి ఆయ‌న తీయ‌రు. తీయ‌లేరు కూడా! ల‌వ్ స్టోరీ సినిమా కూడా ఇలాంటి కోవ‌లోనే ఉంటుంది. ఉండాలి కూడా!
 

శేఖ‌ర్ సినిమాల్లో ఉన్న‌వన్నీ ఈ సినిమాలోనూ ఉంటాయి. అందులో డౌటే లేదు. ఆయ‌న సినిమా లో న‌రుక్కోవ‌డాలు, పొడుచు కోవ‌డాలు, అరుచుకోవ‌డాలు అన్న‌వి ఉండ‌వు.. అస‌లు ఆ త‌ర‌హా క‌త్తీ డాలూ అవ‌స‌ర‌మే లేదు ఆయ‌న‌కు. సున్నిత భావోద్వేగాలు ఉంటాయి. ఆశ నిరాశ సంవాదాలు ఉంటాయి. వాటితో ఆయ‌న మాట్లాడిస్తాడు. ఆ వాదం ఎవ‌రు త‌ప్పు ఎవ‌రు ఒప్పు అన్నది చెప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తాడు. ఆఖ‌రిగా క‌థ  చాలా మంది మ‌న‌సుకు ద‌గ్గ‌ర‌య్యేలా ఎండ్ అయిపోతుంది. చుట్టూ ఉన్న మ‌నుషుల నుంచి వ‌చ్చే క‌థ‌లు బాగుంటాయి. వాటికి హైద్రాబాద్ ఫ్లేవ‌ర్ ఉంటుంది. ఇరానీ ఛాయ్ ఫ్లేవ‌ర్ కూడా ఉంటుంది. అవును! అలాంటి క‌థే ల‌వ్ స్టోరీ కూడా! అయి ఉంటుంది. ఉండాలి కూడా! ఆనంద్, గోదావ‌రి అలాంటి క‌థ‌లే. సినిమాను ఒప్పించే క్ర‌మంలో ఆయ‌న ఎవ్వ‌రి ద‌గ్గ‌ర‌కూ వెళ్ల‌డు. క‌థ రాసుకున్నాక త‌న శైలిని దాటి సినిమా తీయ‌డు. ఈ రెండూ ఆయ‌న‌కు బాగా ఇష్టం అయిన ప‌నులు. వీలున్నంత వ‌ర‌కూ సొంత బ్యాన‌ర్ లో నే సినిమాలు. అమిగోస్ తోనే సినిమాలు తీశాడు. రేప‌టి వేళ తీస్తాడు కూడా.. సునీల్ నారంగ్ లాంటి వారు ఆయ‌న‌కు ఇవాళ వ‌చ్చిన కొత్త స‌పోర్టు. అంతే ఆయ‌నేం మార‌డు. మారాల‌ని భావించ‌డు. త‌న‌కు తెలిసిన క‌థ‌లు, త‌ను చెప్పాల‌నుకున్న క‌థ‌ల్లో బెస్ట్ ఇచ్చి వెళ్లాలి. వెళ్తాడు కూడా! 


మరింత సమాచారం తెలుసుకోండి: