సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో రాణించడం అంత సులువైన విషయం కాదు. చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది కొత్త హీరోహీరోయిన్లు వస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే తక్కువ సమయంలో మంచి విజయాన్ని అందుకుంటూ వుంటారు.  ఇలా ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది కృతి శెట్టి. తెలుగు ప్రేక్షకులందరికీ బేబమ్మ గా మారిపోయింది.  మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఉప్పెన సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో ఆకట్టుకుంది అనే చెప్పాలి.  అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది.



 ఇప్పటికీ కొంతమంది హీరోయిన్లు సరైన హిట్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఈ అమ్మడికి టాలెంట్ తో పాటు అదృష్టం కూడా బాగా కలిసి వచ్చింది. దీంతో చేసిన మొదటి సినిమానే సూపర్ హిట్ అయింది.  ఇక ఉప్పెన సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడి దగ్గరికి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో ప్రస్తుతం అవకాశాలు దక్కించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.  సినిమా విజయాలు వచ్చిన తర్వాత  హీరోయిన్ల రెమ్యూనరేషన్ కూడా అంతకంతకూ పెరిగి పోవడం సహజం. బేబమ్మ కూడా పారితోషికాన్ని భారీగా పెంచేసిందట.



 చేసింది ఒక్క సినిమానే అయిన ఇక పారితోషికాన్ని అమాంతం పెంచేసింది అన్న టాక్ ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఉప్పెన సినిమాకు కేవలం ఆరు లక్షలు మాత్రమే పారితోషికం తీసుకుందట ఈ ముద్దుగుమ్మ. సినిమా ఊహించిన దానికంటే పెద్ద హిట్ సాధించడంతో సినిమా నిర్మాతలు కృతి శెట్టికీ 60 లక్షలు కార్ బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. వరుస అవకాశాలు క్యూ కట్టడంతో  పారితోషికాన్ని అమాంతం పెంచేసిందట. ఏకంగా 80 లక్షల వరకు డిమాండ్ చేస్తుందట.  హిందీలో ఉప్పెన రీమేక్ కోసం కృతి శెట్టి ని సంప్రదించిన చిత్రబృందం కోటి రూపాయలు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: