సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే ఓవైపు ప్రతిభతో పాటు అదృష్టం కూడా కలిసిరావాలి.  లేదంటే ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం లేకపోతే మాత్రం సరైన విజయాలను సాధించడం చిత్ర పరిశ్రమలో కొనసాగడం చాలా కష్టం. ఇప్పటికే ఎంతోమంది హీరో హీరోయిన్ల విషయంలో ఈ విషయం నిరూపితమైంది.  అప్పట్లో రాజశేఖర్ హీరోగా ఎంత సక్సెస్ సాధించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోలకు సైతం పోటీ ఇచ్చాడు. ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగారు.  ఎన్నో ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగానె కొనసాగాడు రాజశేఖర్. ఓవైపు ఫ్యామిలీ కథా చిత్రాలు మరోవైపు పోలీస్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను అందుకున్నాడు..  ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కొనసాగిన రాజశేఖర్ ఒక్కసారిగా సినిమా అవకాశాలు లేకపోవడంతో తెలుగు తెరపై కనుమరుగైపోయారు.  మధ్యలో ఒక్కో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవి కూడా ఫ్లాప్ లు గానే మిగిలిపోయాయి.  దీంతో ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో రాజశేఖర్ కెరియర్ ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో..  ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చాడు రాజశేఖర్. ప్రస్తుతం యువ హీరోలు అందరూ తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతున్న సమయంలో మళ్లీ సరికొత్త ప్రయోగం తో సక్సెస్ అందుకున్నాడు. గరుడవేగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజశేఖర్ ఊహించని విజయాన్ని అందుకున్నాడు అని చెప్పాలి. దీంతో రాజశేఖర్ కెరీర్  కాస్త ట్రాక్ లోకి వచ్చింది. ఇక ఆ తర్వాత కల్కి అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్నాడు రాజశేఖర్. ఇలా ఒకప్పుడు స్టార్ హీరోగా ఎదిగి మధ్యలో అవకాశాలు లేక కనుమరుగైన రాజశేఖర్ యువ హీరోలు ట్రెండ్ నడుస్తున్న సమయంలో కూడా రీ ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో హిట్ అందుకొని సత్తా చాటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: