సాధారణంగా మనిషి అన్నాక కోరికలు సహజం.. ఆ కోరికలు అందరికీ నెరవేరుతాయా..? అంటే చెప్పలేని పరిస్థితి.. కొందరి కోరికలు తీరే లాగా ఉంటే , మరి కొందరి కోరికలు ఆకాశాన్ని అందుతూ ఉంటాయి.. ఇకపోతే మన ఈ ప్రముఖ హీరోయిన్ కి కూడా ఒక కోరిక ఉందట.. అయితే ఆ కోరిక నెరవేరుతుందో లేదో మాత్రం తెలియదు కానీ , ఆమె తన కోరికలను నెరవేర్చుకోవడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.. అయితే ఈ హీరోయిన్ కోరిక ఏమిటి..? అది నెరవేరుతుందా .?అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


తన అందంతో, నటనతో ప్రేక్షకులను మైమరపింప చేసేలా చేసిన కుర్రహీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. అయితే ఈమె సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక తన కోరిక విషయానికి వస్తే,  ఈమెకు స్టార్ హీరోయిన్ అవ్వాలనే ఆశ చాలా ఉందట.. అందుకు తగ్గట్టుగానే ప్రముఖ స్టార్ హీరో బాలకృష్ణ నటిస్తున్న అఖండ సినిమాలో  ప్రగ్యా జైస్వాల్ కూడా నటిస్తోంది.. ఈ భారీ ప్రాజెక్టు పై ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.. ఇకపోతే ఈ సినిమాలో ఈమె పాత్ర ఏమిటి..? ఆ పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంది ..? అనే విషయాన్ని అడగగా.. ఇలా సమాధానం ఇచ్చింది.

దర్శకుడు బోయపాటి శ్రీను నా పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది.. నేను మిగతా సినిమాలలో నటించిన తీరును గమనించిన ఆయన, ఈ సినిమాలో నా లుక్ తో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా అందుకు భిన్నంగా తాజాగా ఉండాలని, ఎంతో శ్రమపడి నాకోసం ఒక ప్రత్యేకమైన పాత్రను ఏర్పాటు చేయడం జరిగింది.. ఇక ఈ సినిమాలో నేను ప్రతి ఒక్కరికి సరికొత్త లుక్ లో కనిపిస్తాను అని చెప్పింది ప్రగ్యా జైస్వాల్.

అఖండ సినిమా నుంచి విడుదలైన "అడిగా .. అడిగా" అనే పాట ఎంతో కష్టపడి చిత్రీకరించారు.. ఈ పాటలో నా లుక్  కూడా చాలా అదిరింది.. మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది.. ఏది ఏమైనా ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట నా పాటే కావడం చాలా ఆనందంగా ఉంది.. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటే త్వరలో స్టార్ హీరోయిన్ అయ్యే అదృష్టం కూడా వస్తే చాలా బాగుంటుంది అని ఆమె తెలిపింది

మరింత సమాచారం తెలుసుకోండి: