టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున న‌ట‌వార‌సుడిగా ఇండ‌స్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగ‌చైత‌న్య వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. చైతూ ఇప్ప‌టి వ‌ర‌కూ చాలా సినిమాల‌లో న‌టించ‌గా ఒక్కో సినిమాలోనూ త‌న డిఫ‌రెంట్ స్టైల్ తో ఆక‌ట్టుకున్నాడు. మొద‌ట‌గా చైతూ జోష్ లాంటి మాస్ అండ్ కాలేజీ డ్రామాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఆ సినిమాలో చైతూ న‌ట‌న ప‌ర‌వాలేదు అనిపించినా కొన్ని విమ‌ర్శలు కూడా ఎదుర్కోవ‌ల‌సి వ‌చ్చింది. ఇక ఆ త‌ర‌వాత మ‌ళ్లీ నాగ‌చైత‌న్య మాస్ సినిమాలు చేసినా పెద్ద‌గా క్రేజ్ రాలేదు కానీ ల‌వ్ స్టోరీ చిత్రాల‌తోనే చైతూకు ఎంతో క్రేజ్ వ‌చ్చింది. దాంతో ల‌వ‌ర్ బాయ్ గా చైత‌న్య టాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును సాధించాడు. 

ఇక ఇప్ప‌టి వ‌ర‌కూ నాగ చైతన్య చేసిన సినిమాలో మంచి విజ‌యం సాధించిన ఏమాయ చేసావే, 100 ప‌ర్సెంట్ ల‌వ్, మ‌జిలీ, ప్రేమ‌మ్, మ‌నం లాంటి సినిమాల‌న్నీ కూడా ప్రేమ‌క‌థ‌లే కావ‌డం విషేశం. అయితే నాగ చైత‌న్య ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో సినిమాల‌లో న‌టించిన‌ప్ప‌టికీ ఎంతో సాఫ్ట్ గా ల‌వ‌ర్ బాయ్ లుక్ లో క‌నిపించాడు గానీ ఏ సినిమాలోనూ మిడిల్ క్లాస్ లుక్ లో క‌నిపించ‌లేదు. అంతే కాకుండా చైతూ ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ సినిమాలోనూ తెలంగాణ కుర్రాడిగా క‌నిపించ‌లేదు కూడా. ఇక మొద‌టి సారి నాగ చైత‌న్య‌ను తెలంగాణ యాస‌లో మిడిల్ క్లాస్ కుర్రాడిగా ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల చూపించిన‌ట్టు తెలుస్తోంది.

నాగ చైత‌న్య హీరోగా న‌టించిన తాజా చిత్రం లవ్ స్టోరీ నేడు విడుద‌ల కాగా ఈ సినిమాలో చైతూ మిడిల్ క్లాస్ కుర్రాడి లుక్ లోనే క‌నింపించాడ‌ట‌. అంతే కాకుండా ట్రైల‌ర్ లో ఊడుస్తూ క‌నిపించిన చైతూ సినిమాలో అలాంటి ఎన్నో రియాలిటీకి దగ్గ‌ర‌గా ఉండే స‌న్నివేశాల‌లో క‌నిపించి అద‌ర‌గొట్టార‌ట‌. ఇక నాగ చైత‌న్య సామ్ తో క‌లిసి న‌టించిన మ‌జిలీ సినిమాలో త‌న న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు అందుకోగా మ‌రోసారి అంత‌కు మించిన ప్ర‌శంస‌లు ల‌వ్ స్టోరీ చిత్రానికి గానూ అందుకుంటున్నాడు. ఈ సినిమాలో చైతూ తెలంగాణ యాస‌లో అద‌ర‌గొట్టాడ‌ని..అదే విధంగా చైతూ న‌టించిన పాత్ర కూడా ఛాలెంజింగ్ గా ఉంద‌ని ప్ర‌శంస‌లు అందుతున్నాయి. ఇక ఈ సినిమా చైతూకి కెరీర్ బెస్ట్ సినిమాగా నిలుస్తుంద‌ని అభిమానులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: