సినిమా పరిశ్రమలో రావాలంటే, నిలదొక్కుకోవాలంటే వారసత్వం అనేది ఎంట్రీ పాస్ మాత్రమే. ఆ తర్వాత వారి టాలెంట్, వారి కృషి సినిమా పరిశ్రమలో వారు అత్యున్నత స్థానాలకు ఎదగడానికి కారణాలవుతాయి. అలా అక్కినేని నట వారసుడిగా జోష్ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు అక్కినేని నాగచైతన్య. తొలి సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న నాగచైతన్య రెండో సినిమామాయ చేసావే చిత్రంతో నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు.

ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా ఆయనకు పెద్దగా ఉపయోగపడలేదు. దాంతో మంచి సినిమాలు చేయాలని మధ్యలో కొన్ని కొన్ని ప్రయోగాలు కూడా చేశాడు.  వాటిలో కొన్ని సినిమాలు సూపర్ హిట్ కూడా అయ్యాయి. అలా ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పటివరకు ప్రేక్షకులను బాగా అలరిస్తు వచ్చి కోట్లాది మంది అభిమానులను ఏర్పరుచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అక్కినేని నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ చిత్రం విడుదలై ప్రేక్షకుల లో సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది.

సినిమా కేవలం సూపర్ హిట్ అవడమే కాదు నాగచైతన్య కూడా గొప్ప పేరు వచ్చింది. డాన్స్ లో కూడా నాగ చైతన్య ఇంకా ఆదరగోట్టాడని చెప్తున్నారు. సాయి పల్లవి కి సరిసమానంగా అందరిని డాన్స్ తో అలరించాడు.  ఈ చిత్రంతో గతంలో ఎప్పుడు చూడని నాగచైతన్యను చూశామని ప్రేక్షకులు సైతం చెబుతుండడం విశేషం. ఆయనలో గతంలో కంటే ఎక్కువగా హిట్ కొట్టాలనే తపన విజయం సాధించాలనే ఆకాంక్ష ఉన్నాయని వారు చెబుతున్నారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కుంటూ ఇప్పటివరకు వచ్చిన నాగ చైతన్య ఈ సినిమాతో సంపూర్ణ నటుడిగా మారాడని చెప్పవచ్చు. నటుడిగా అందరినీ ఎంతగానో సంతృప్తి పరిచిన నాగచైతన్య భవిష్యత్తులో ఇంకా ఇలాంటి అద్భుతమైన పాత్రలలో జీవిస్తాడు చూడాలి. మజిలీ తర్వాత ఆ రేంజిలో హిట్ సంపాదించిన అక్కినేని నాగచైతన్య చిత్రం ఇదే. 

మరింత సమాచారం తెలుసుకోండి: