మన తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది అగ్ర దర్శకులు ఉన్నారు. అయితే వారిలో చాలావరకు ఓ సినిమాని తెరకెక్కించాలంటే ఎక్కువగా కమర్షియల్ అంశాలనే ఎంచుకుంటూ ఉంటారు. అయితే కొందరు మాత్రమే సమాజానికి ఉపయోగపడే, ప్రజలను ఆలోచింపజేసే సినిమాలను తెరకెక్కిస్తారు. వారిలో దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ఒకరు. ఈ దర్శకుడి సినిమాలను ఇష్టపడని వారుండరు. ఎందుకంటే తన సినిమాల్లో ఒక సోల్ ఉంటుంది. ఎటువంటి కమర్షియల్ అంశాలు లేకుండా, తాను సమాజానికి ఏం చెప్పాలని అనుకుంటున్నాడో.. దాన్నే తన దర్శకత్వ ప్రతిభతో తెరపై చూపిస్తాడు.శేఖర్ కమ్ముల తీసింది తక్కువ సినిమాలే అయినా..

ఆ సినిమాలతోనే ఇండ్రస్టీ లో ఒక సెన్సిబుల్ డైరెక్టర్ గా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు మరోసారి కూడా అదే ప్రయత్నం చేసాడు శేఖర్ కమ్ముల. ఈసారి మరో సరికొత్త పాయింట్ తో 'లవ్ స్టోరీ' అనే సినిమాను తెరకెక్కించాడు. నాగ చైతన్య, సాయి పల్లవి హీరో,హీరోయిన్లు గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచంలో వ్యాప్తంగా విడుదలైంది.ఇక ఇప్పటికే ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా సినిమాలో దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ సరికొత్త పాయింట్ ని టచ్ చేసాడు.కుల, మత వివక్ష లాంటి సున్నితమైన,క్లిష్టమైన అంశాలకి తోడుగా ప్రస్తుత సమాజంలో పిల్లల పై లైంగిక దాడులు అనే..

సెన్సిబుల్ పాయింట్ తో కథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు శేఖర్ కమ్ముల.ఇక ఇప్పటికే గతంలో కుల, మతాల నేపథ్యంలో వచ్చిన సినిమాలను ఇటీవల ఆడియన్స్ తిరస్కరిస్తున్న నేపథ్యంలో ఇలాంటి సమస్యను చర్చించేలా వెండితెరపై ఎంచుకున్న శేఖర్ కమ్ముల పంథా బాగుంది.అయితే మన టాప్ డైరెక్టర్స్ మాత్రం ఇలాంటి ఓ పెయింట్ ని తీసుకొని దాన్ని సినిమాగా తీయడానికి జంకుతారు. అలాంటిది శేఖర్ కమ్ముల మాత్రం 'లవ్ స్టోరీ' సినిమా ద్వారా ఒక కొత్త ఆలోచనను ప్రేక్షకుల్లో నాటారు. అంతేకాకుండా ఈ సినిమాతో ఆడియన్స్ ని ఆలోచింపజేశాడు ఈ దర్శకుడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: