హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ సినిమాలతో ఎంత బిజీగా ఉంటుందో, సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడూ తను చేసే సినిమాల గురించి మరియు మరియు అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు ఉంటుంది. ఇలా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈస్మార్ట్ బ్యూటీ గత అయిదారు రోజులుగా సైలెంట్ గా ఉంటుంది. ఇలా సైలెంట్ గా ఉన్నా ఈస్మార్ట్ బ్యూటీ తన ఫాలోవర్స్ తో మరింత ఇంటరాక్ట్ అవ్వడానికి చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ హాట్ బ్యూటీ ఒక సర్వే కూడా చేపట్టింది. తాను ఇంకా ఇన్ స్టాగ్రామ్  లో యాక్టివ్ గా ఉండాలని ఎంత మంది కోరుకుంటున్నారు.? అని నిధి అగర్వాల్ ఓ పోల్ పెట్టింది. ఆ పోల్ లో దాదాపు 93 శాతం మంది నిధిని ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండమని కోరారు. దీనితో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ తన అభిమానుల రిక్వెస్ట్ అంగీకరించింది.

తాను ఇంత దూరం ప్రయాణించడానికి, ఇంతటి స్టార్ డామ్ రావడానికి కారణం అభిమానులే అని ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ చెప్పింది. తనకు కూడా ఈ మధ్య అభిమానులకు దూరంగా ఉంటున్నాను అనే ఫీలింగ్ కలిగిందని అందుకే ఇకపై నుంచి మరింతగా ఇంటరాక్ట్ అవుతానని నిధి అగర్వాల్ తెలిపింది. ఇందులో భాగంగానే నిధి అగర్వాల్ ఇకపై తనకు సంబంధించిన 12 సీక్రెట్ లను ఒక్కొక్కటిగా తన 12 మిలియన్ల ఫాలోవర్ లకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేస్తాను అని నిధి అగర్వాల్ తెలిపింది. చెప్పినట్టుగానే నిధి అగర్వాల్ అందులోని మొదటి సీక్రెట్ ను బయటపెట్టింది. నిధి అగర్వాల్ చేతిని, గోర్లను చూసిన ప్రతీ ఒక్కరూ వాటిని గురించి అడుగుతారట. వాటి కోసం స్పెషల్‌గా ఏమైనా చేస్తావా? డిజైన్ చేస్తావా? అలా షేప్ చేస్తావా? అని అడుగు ఉంటారట. కానీ అవి సహజంగానే అలా ఉంటాయని, వాటిని అలా ఉంచడమే తనకు ఇష్టమని హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది. ఇకపై నిధి అగర్వాల్ ఎలాంటి సీట్లను బయటపడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: