ఇటీవల కాలంలో అక్కినేని నాగచైతన్య మరియు ఆయన సతీమణి అక్కినేని సమంత తో విడిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకొని అధికారికంగా విడిపోబోతున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన ఎవరు చేయకపోయినా కూడా వీరిద్దరూ కొన్ని అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకో బోతున్నారని, 250 కోట్ల భరణాన్ని నాగచైతన్య సమంత కి చెల్లిస్తున్నారని వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే పెద్ద సెన్సేషన్ గా మారింది. వీరు ప్రేమించుకున్నప్పుడు ఎంత పెద్ద సంచలనం అయ్యిందో ఇప్పుడు విడిపోయేటప్పుడు కూడా అంతే సంచలనం అవుతూ ప్రతి ఒక్కరి చర్చ లో భాగం అవుతుంది. తాజాగా నాగచైతన్య హీరో గా నటించిన లవ్ స్టోరీ చిత్రం ను ఈరోజు విడుదల చేయగా ఆ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ అందుకుని సూపర్ హిట్ దిశగా దూసుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ కొంతమంది అభిమానులు వీరిద్దరు విడిపోకూడదని మీరు కలిసి ఉండాలని అలా అయితే మేము హ్యాపీ గా ఉంటామని అని చెప్పారు. 

అంతేకాదు ఈ సినిమాలో నాగచైతన్య నటన చాలా అద్భుతంగా ఉందని నాగచైతన్యకు బిగ్గెస్ట్ హిట్ వచ్చిందని కూడా వారు చెప్పారు. ఈ సినిమా కేవలం నాగ చైతన్య కోసమే చూడాలని గతంలో ఏ చిత్రంలో చేయని విధంగా ఈ సినిమాలో ఆయన అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారని తెలిపారు. మొత్తంగా అక్కినేని అభిమానులను ఎంతగానో సంతోష పరచిన ఈ సినిమా అక్కినేని నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ దెబ్బతో నాగ చైతన్య స్టార్ హీరో స్టేటస్ కు వచ్చేశాడు అని చెప్పవచ్చు. అక్కినేని హీరోలు వెనుకబడ్డారు అన్న వాదన బాగా వస్తున్న వేళ నాగచైతన్య ఈ రేంజ్ హిట్ కొట్టడం అక్కినేని అభిమానులకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: