లవ్ స్టోరీ సినిమాతో అక్కినేని నాగచైతన్య చాలా రోజుల తర్వాత సోలో గా సూపర్ హిట్ ను అందుకున్నాడు. మజిలి సినిమా తర్వాత ఆయన ఈ విజయాన్ని అందుకోవడం విశేషం.వెంకీ మామ చిత్రం సూపర్ హిట్ అయినా వెంకీ మరో హీరోగా నటిస్తుండటం, ఇది మల్టీ స్టారర్ చిత్రం కావడం తో ఆ చిత్రం తాలూకు పూర్తి హిట్ తన ఖాతాలోకి వెళ్ళలేదు.  కానీ లవ్ స్టోరీ సినిమా విజయం మొత్తం అక్కినేని నాగచైతన్య కే దక్కిందని చెప్పాలి.  ఈ సినిమాలో అద్భుతమైన నటన ను కనపరిచి ప్రేక్షకులను ఎంతగానో అలరింపచేశాడు నాగచైతన్య.

అక్కినేని నాగచైతన్యకు ఈ రేంజ్లో ప్రశంసలు ఏ సినిమాకు రాలేదనే చెప్పాలి. అప్పట్లో ఏ మాయ చేసావే చిత్రం సమయంలో ప్రేక్షకుల నుంచి ఎంతో జెన్యూన్ గా మంచి ప్రశంసలు వచ్చాయి. సమంత హీరోయిన్ గా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏమాయ చేసావే చిత్రం అక్కినేని నాగచైతన్య కెరీర్లో రెండవ చిత్రం. మొదటి చిత్రం జోష్ ప్లాప్ కావడంతో ఈ చిత్రంతో ఎలాగైనా హిట్టు సంపాదించాలని నాగచైతన్య తమిళంలో భారీ చిత్రాల దర్శకుడు ప్రేమకథా చిత్రాల దర్శకుడు గౌతమ్ మీనన్ తో ఏం మాయ చేశావే చిత్రం చేశాడు.

అప్పటికే ఓకే సినిమా చూసిన అనుభవం పెద్ద డైరెక్టర్ తో సినిమా చేస్తున్న భయం అక్కినేని నాగచైతన్య లో కనిపించగా సినిమాలో మాత్రం అవేవీ కనిపించకుండా మెయింటెన్ చేసి మంచి నటనతో ప్రేక్షకులను అలరించి సూపర్ హిట్ ను అందుకున్నాడు. కార్తీక్ గా అప్పుడు ప్రేక్షకులను ఎంత బాగా అయితే అలరించాడో ఇప్పుడు రేవంత్ గా కూడా అంతే బాగా ప్రేక్షకులను అలరించి భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ సినిమా విజయంతో నాగచైతన్య స్టార్ హీరోల జాబితాలో చేరినట్లే. రాబోయే ఆయన చిత్రాలకు కూడా పెద్ద హీరోల సినిమాల మాదిరిగానే మంచి క్రేజ్ నెలకొని ఉంటుంది. మరి భవిష్యత్తులో ఈ లవ్ స్టోరీ సినిమా ఇంకా ఎలాంటి సంచలనాలను సృష్టించే రికార్డులను
 సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: