తమిళ సినిమా ఇండస్ట్రీ మాట ఎత్తితే... రజినీకాంత్, అజిత్‌, విజయ్‌ పేర్లే ఎక్కువగా వినిపిస్తాయి.  తమ హీరో గొప్ప అంటే తమ గొప్పఅంటూ ఫ్యాన్స్ గొడవలు పడే స్థాయికి వెళ్లిపోతాయి. సోషల్ మీడియాలోనే జరిగే ఫైటింగ్ లు.. ఒక్కో సారి డైరెక్ట్ గా కాలర్ పట్టుకునే దాకా కూడా వెళ్లిపోతుంది. అయితే అభిమానులు పైట్ చేసుకుంటున్నారు గానీ.. హీరోలు మాత్రం మంచి అండర్‌ స్టాండింగ్‌తో ముందుకెళ్తున్నారు. విడుదల తేదీలు మార్చుకుంటూ బాక్సాఫీస్ కొల్లగొట్టే పనిలో ఉన్నారు.  

అజిత్, విజయ్‌ ఎప్పుడూ కలెక్షన్లు, రికార్డుల గురించి గొడవలు పడలేదు. కానీ వీళ్ల అభిమానులు మాత్రం సామాజిక మాద్యమాల్లో యుద్ధాలే చేస్తుంటారు. టీజర్, సినిమాల వ్యూస్ పేరుతో చెలరేగిపోతుంటారు. అజిత్‌, హెచ్.వినోద్ కాంబినేషన్‌లో వస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వాలిమై'. పోస్టర్స్‌తోనే సూపర్ బజ్ తెచ్చుకున్న ఈ సినిమా వచ్చే పొంగల్‌కి విడుదల కాబోతోంది. జనవరి 14న ఈ సినిమాని విడుదల చేస్తున్నారు నిర్మాతలు. అయితే ఈ సినిమా దీపావళికే విడుదల  కావాల్సింది. కానీ పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్స్‌ పూర్తి కాలేదని వచ్చే సంక్రాంతికి వాయిదా వేశారు మేకర్స్.

విజయ్ 'బీస్ట్' సినిమా ఈ పొంగల్‌కే విడుదల అని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు 'వాలిమై' కూడా సంక్రాంతికి విడుదల అని ప్రకటించగానే థియేటర్ల దగ్గర అజిత్, విజయ్ అభిమానులు గొడవలు పెరుగుతాయేమో అని ఇండస్ట్రీలో ఒక టాక్ వచ్చింది. కానీ విజయ్‌ ఫ్యాన్‌ వార్‌కి ఫుల్‌స్టాప్‌ పెడుతున్నాడట. విజయ్ 'బీస్ట్' సినిమా పొంగల్ నుంచి సమ్మర్‌కి వెళ్తుందట. అజిత్ పొంగల్ బరిలో దిగాలని ప్లాన్‌ చేసుకున్నప్పుడే విజయ్‌ టీమ్‌తో చర్చలు జరిగి ఉంటాయి. ఇద్దరూ ఓకే అనుకున్న తర్వాతే 'వాలిమై'ని పొంగల్‌కి ఫిక్స్‌ చేసి ఉంటారని మాట్లాడుకుంటున్నారు కోలీవుడ్ జనాలు. అయితే 'వాలిమై' దీపావళి నుంచి తప్పుకుంది కాబట్టి రజనీకాంత్ 'అన్నాథే' ఓపెనింగ్స్‌ డివైడ్ అయ్యే ప్రమాదం తగ్గుతుంది చెప్పొచ్చు. సెకండ్ వేవ్ తర్వాత కోలీవుడ్ ఇంకా కోలుకోలేదు. వసూళ్లు లేక తమిళ పరిశ్రమ ఇంకా స్తబ్ధుగానే ఉంది.  ఒక్కో హీరో ఒక్కో సీజన్‌లో వస్తున్నాడు. దీంతో కలెక్షన్లు కూడా పెద్దగా ఎఫెక్ట్‌ కావని చెప్పొచ్చు. అలాగే నిర్మాతలకి మంచి లాభాలు వస్తాయి.  మరింత సమాచారం తెలుసుకోండి: