బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఇక ప్రస్తుతం హౌస్ లో లవ్ స్టోరీస్ హవా నడుస్తోంది.ప్రతీ హౌస్ మేట్ తనకి సంబంధించిన ఫస్ట్ లవ్ కి సంబంధించిన మెమోరీస్ ని ఆడియన్స్ తో షేర్ చేసుకున్నారు.ఇక వీరిలో లోబో లవ్ స్టోరీ అందర్నీ ఎంతో ఆకట్టుకుంది.ఇక ఆ లవ్ స్టోరీని లోబో మాటల్లోనే వింటే..రెడ్ బెలూన్ పైన.. 14 ఏళ్ల నిజమైన ప్రేమ నాది.ఈ రోజు వరకు ఆమె తాగిన ప్లాస్టిక్ కప్పులు నా దగ్గరే ఉన్నాయి,ఆమె ముట్టుకున్న మిల్క్ పేపర్స్,ఆమె వాడిన టిష్యులు,లిప్ స్టిక్స్ కూడా ఉన్నాయి.ఇప్పుడు ఆమెకి పెళ్ళై పోయింది.ఆమెకి ఒక కొడుకు కూడా ఉన్నాడు.నాకు కూడా పెళ్లి అయింది.

నాకూ ఒక కూతురు ఉంది.అందరిలాగా నేను ఎడవలేదు.ఎందుకంటే నాకు బాధ్యతలు చాలా ఉన్నాయి.రీసెంట్ గా ఆమె పుట్టినరోజున నేను ఒక ట్యాటూ ని గిఫ్ట్ గా ఇచ్చానని చెప్తూ..22 మే నెల 1:30 నిమిషాలు అంటూ వాచ్ చేంజ్డ్ మై లైఫ్ అనే టాటూ ని చూపించాడు లోబో.నాకు తర్వాత పెళ్లి అయ్యింది,కూతురు పుట్టింది.ఆమెని నేను ప్రేమగా ఇశ్రాక్ అని పిలుస్తాను.నా కూతురు పేరు కూడా అదే వచ్చేలా పెట్టుకున్నాను.కానీ, ఆ అమ్మాయి పేరు మాత్రం శృతి.కానీ నేను ప్రేమగా ఇశ్రాక్ అని పిలుస్తాను.ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా నా కెరీర్ మొదలైంది.అక్కడ్నుంచి నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే కారణం నా భార్య షాహిన్ బేగం అంటూ చెప్పాడు లోబో.

ఇక లోబో లవ్ స్టోరీ విన్న హౌస్ మేట్స్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక లోబో తర్వాత మిగతా హౌస్ మేట్స్ తమ మొదటి ప్రేమకు సంబంధించిన జ్ఞాపకాలను అందరితో పంచుకున్నారు.అయితే గత వారం హౌస్ లో చాలా గొడవలు జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆడియన్స్ లో కుడి కాస్త నెగిటీవీటి మొదలైంది. ఇక ఇలానే కొనసాగితే అది ఇతర పరిణామాలకు దారి తీస్తుందని ఊహించిన బిగ్ బాస్ ఈ వారం ఇలా అందరిని కనెక్ట్ చేయడానికి ఇలా లవ్ స్టోరీస్ టాస్క్ పెట్టాడు.మొత్తానికి ప్రస్తుతం హౌస్ మేట్స్ అందరూ తమ లవ్ స్టోరీస్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారనే చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: