టాలీవుడ్ సినిమా పరిశ్రమలో వారసుడిగా వచ్చిన హీరోలు చాలా మంది ఉన్నా అందులో స్టార్ హీరోగా ఎదిగిన వారు చాలా తక్కువ మంది ఉన్నా రు. సినిమా ఇండస్ట్రీలోకి వారసత్వం అనే కార్డు ఉపయోగించుకొని వచ్చి ఆ తరువాత సరైన సినిమాలు చేయలేక ప్రేక్షకులను మెప్పించలేక వారు క్రమ క్రమంగా ఫేడ్ అవుట్ అవ్వడం జరిగింది. అలాంటి వారిలో ఒకరు అక్కినేని నట వారసుడిగా సినిమాల్లోకి ప్రవేశించిన అక్కినేని సుమంత్.

ఆయన హీరోగా ప్రేమ కథ అనే చిత్రం తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. దాంతో అక్కినేని వంశం నుంచి మరొక స్టార్ హీరో పుట్టుకు వచ్చాడు అని అందరూ అనుకున్నారు. అయితే సుమంత్ ఆ తర్వాత చేసిన సినిమాలతో ప్రేక్షకులను ఏమాత్రం నొప్పించక పోవడం తో ఒక్కసారిగా స్టార్ హీరో స్టేటస్ దగ్గరనుంచి చిన్న హీరో రేంజ్ గుర్తింపు పొందాడు. మధ్యలో ఆయన పెళ్లి విఫలం అవ్వడం వరుస సినిమాలు ఫెయిల్యూర్ అవడతో డిప్రెషన్లోకి వెళ్లి పోయినా సుమంత్ సరేనా సినిమాలు చేయలేక దాదాపుగా ప్రేక్షకులకు దూరం అయిపోయాడు.

ఇటీవలే మళ్లీ రావా అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించి మళ్ళీ ఫాంలోకి వచ్చినట్లు కనిపిస్తోంది ఆ సినిమాలో హీరోగా నటించిన సుమంత్ లా ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయం సాధించాడు. ఆ తర్వాత కొంత పుంజుకొని మంచి మంచి సినిమాలు చేసుకుంటూ వచ్చి హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా వరుస సినిమాలతో అయితే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్టులు తిరగేస్తూ బిజీగా ఉన్న సుమంత్ ఇకపై మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు మాత్రమే చేస్తానని చెబుతున్నాడు. ఈసారి సుమంత్ మంచి సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తే డా లేదా గతంలోలా ఫేడౌట్ అయిపోతాడా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: