టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొంత మంది హీరోలు చేజేతుల తమ కెరీర్ను నాశనం చేసుకుంటారు వచ్చిన హైప్ ని ఇమేజ్ ను స్టార్ డం గా నిలబెట్టుకోలేక వచ్చిన ప్రతి సినిమా అలా చేసి  ప్రేక్షకులలో ఉన్న ఇమేజ్ ను కోల్పోతుంటారు. ఆవిధంగా ప్రేక్షకులలో మొదట్లో సినిమాలతో బాగానే అలరించిన ఆ తరువాత తప్పుడు సినిమాల ఎంపిక లతో నవదీప్ తెలుగు ప్రేక్షకులకు దూరం అయిపోయాడు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు విలన్ పాత్రలో చేసుకుంటూ కెరియర్ గడపాల్సి వస్తుంది. 

చందమామ సినిమాతో టాలీవుడ్లో నవదీప్ అనే ఒక హీరో ఉన్నాడని అందరికీ తెలిసింది. ఆ సినిమాతో మంచి స్టార్ డమ్ దక్కించుకున్న నవదీప్ గౌతమ్ ఎస్ఎస్స్సి సినిమాతో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆర్య 2 లో కూడా ఓ విభిన్నమైన పాత్ర చేసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ఈయన లో మంచి నటుడు అయితే ఉన్నాడని గమనించారు. కానీ ఆయన సినిమాల ఎంపికలో లోపాలు చాలా ఉండడంతో ఆయన హీరోగా పనికిరాడని ప్రేక్షకులు తేల్చేశారు. 

దానికి తోడు ఆయన కు ఇండస్ట్రీలో ప్లేబాయ్ అనే ముద్ర ఉండటం అమ్మాయిలను బాగా వాడుకుంటాడని బ్యాడ్ నేమ్ ఉండడం అలాగే డ్రగ్స్ కూడా తీసుకుంటాడని అపవాదులు ఉండడంతో ఆయనకు సినిమా అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. వీటన్నిటి మధ్య ఆయన సినిమాలను సరిగ్గా ఎంపిక చేసుకోలేక ఫ్లాపులను ఎదుర్కొని మెల్ల మెల్లగా తెలుగు ప్రేక్షకులు మర్చిపోయేలా చేసుకున్నాడు. ఇప్పటికీ స్టార్ హీరోల సినిమా లలో ప్రత్యేకమైన పాత్ర అంతే నవదీప్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రామ్ చరణ్ హీరోగా నటించిన ధ్రువ సినిమాలో కూడా ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మళ్లీ ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం చేయగా ప్రస్తుతం ఓ సినిమాలో హీరో గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా అయినా ఆయనకు మంచి విజయాన్ని అందిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: