శ్రీ ఎస్పీ బాలు సుబ్రమణ్యం.. ఈయన గొంతు కోకిల కన్నా మిన్న.. ఈయన అందించే సంగీతం ప్రపంచంలోనే ఒక అద్భుతం అని చెప్పాలి.. నటుడిగా, సంగీత దర్శకుడిగా, సినిమా నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రముఖ గాయకుడు శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం.. ఈయన కోసం హీరో హీరోయిన్లు కూడా ఎదురు చూసిన రోజులు చాలానే ఉన్నాయి.. ముఖ్యంగా ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడితేనే ఆ సినిమాలో నటిస్తామన్నట్లు గా కూడా అప్పట్లో ప్రవర్తించేవారు. ఇక ముఖ్యంగా ఈయన కోసం హీరో హీరోయిన్లు మాత్రమే కాదు దర్శకనిర్మాతలు కూడా తమ సినిమాలలో సంగీత దర్శకత్వం అందించడానికి ఈయన కోసం ఎదురుచూసేవారు.


ఇకపోతే ఇంత పెద్ద  గొప్ప సంగీత విద్వాంసుడు ఒకసారి ప్రముఖ గాయని చిత్ర కోసం ఎదురు చూశారట.. అంతే కాదు ఆమె కోసం ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎదురుచూస్తూ ఉండడంతో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కూడా ఆమెపై కోప్పడడం కూడా జరిగింది..ఇక ఒక్కసారిగా చిత్ర ఏడవడం తో ఇళయరాజా ఆమెను తన ఆఫీస్ లోపలికి పిలిపించి, అంత పెద్ద గొప్ప సంగీత దర్శకుడు నీకోసం ఎదురు చూడడం ఎంతవరకు కరెక్ట్.. సమయానికి రావాలి కదా..! అని ఓదార్చి , ఆమెకు త్యాగరాజ ఫోటోను కూడా బహుకరించారట.. అయితే ఇంతకు చిత్ర కు లేట్ కావడానికి గల కారణం ఏమిటి..?బాలసుబ్రమణ్యం గారు ఆమె కోసం ఎదురు చూడవలసిన అవసరం ఏమిటి..? అనే విషయాలను ఇప్పుడు చదివి తెలుసుకుందాం..


ఒకసారి బాలసుబ్రహ్మణ్యంతో కలసి చిత్ర ఒక సినిమాలో పాటను పాడవలసి ఉంది.. అయితే ఆమె 10 గంటలకు అంత స్టూడియోకి చేరుకోవాలి.. ఇక 10 గంటలకు బాలసుబ్రహ్మణ్యం తో కలిసి  పాడాలి కాబట్టి ..అంతలోపు వేరొక సినిమాలో పాటలు పాడి వస్తానని ఆమె చెప్పడంతో.. ఇళయరాజా మేనేజర్ అందుకు ఒప్పుకున్నారు.. కానీ పాటలు పాడే సమయంలో కరెంటు పోవడంతో అక్కడే 12 గంటల సమయం అయిపోయింది.. చిత్ర కోసం ఏకంగా రెండు గంటలపాటు ఎదురుచూసిన బాలసుబ్రమణ్యం.. వెంటనే చిత్రం రావడం చూసి ఆడియో రికార్డింగ్ మొదలుపెట్టారు.. ఇలా చిత్ర కోసం బాలసుబ్రమణ్యం ఎదురుచూడాల్సి వచ్చింది.. బాలసుబ్రహ్మణ్యం గారే చిత్రకి తెలుగు పలుకులు కూడా  నేర్పించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: