ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒక సంగీత దర్శకుడిగా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన గాయకుడు అని చెప్పవచ్చు.. ఈయన ఎవరి దగ్గర సంగీత విద్యను అభ్యసించ లేదు.. తనకున్న మేధా సంపత్తితోనే విన్నది విన్నట్టుగా గుర్తు పెట్టుకున్న మహా మేధావి.. ఇకపోతే ఆయన తన సినీ జీవితంలో ఏకంగా 40 వేల పాటలు పాడి.. రికార్డు సృష్టించారు అని చెప్పవచ్చు. ఈయన చేపట్టిన కార్యక్రమాలలో పాడుతా తీయగా వంటి కార్యక్రమాలు ఏకంగా అమెరికాలో కూడా మంచి గుర్తింపు పొందాయి అంటే ఆయన ఎంత పెద్ద గాయకుడో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇకపోతే ఆయన ఏ సినిమాకు పాడినా కూడా ఏ రోజు కూడా రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేదట.  బాలసుబ్రమణ్యం పాడిన పాటలకు ఎవరు ఎంత ఇస్తే అంత పుచ్చుకొని  వెళ్లిపోయారట.  ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీత దర్శకుడిగా.. గాయకుడిగా.. న్యాయనిర్ణేతగా.. నటుడిగా.. ప్రొడ్యూసర్ గా.. ఇలా ఎన్నో రకాలుగా తనలో ఉన్న ప్రతిభను చాటిన గొప్ప గాయకుడు.. ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం వ్యక్తిగత విషయానికి వస్తే.. ఈయనకు సావిత్రి అనే ఆవిడ తో వివాహం జరిగింది.. వీరికి పల్లవి అనే కూతురు, ఎస్పీ.చరణ్ అనే ఒక కొడుకు కూడా ఉన్నారు.. ఎస్పీ చరణ్ మొదట సినిమా లో పాటలు పాడి  , ఆతర్వాత సినిమా నిర్మాతగా గుర్తింపు పొందుతున్నాడు.


మొదట పదుల రూపాయలలో  రెమ్యునరేషన్ తీసుకునే స్థాయి నుంచి లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగి పోయారు. ఇక వీరి కొడుకు ఎస్ పి చరణ్ నిర్మాతగా 5 సినిమాల వల్ల ఏకంగా 11 కోట్ల రూపాయలు నష్టాన్ని చవి చూశాడు. ఇక ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం  సంపాదించిన డబ్బులను ఎక్కువగా భూముల కొనుగోలు, ల్యాండ్ కొనుగోలు లాంటి పైన ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఈయన ఆస్తులు చెన్నై ,నెల్లూరు, హైదరాబాద్ లో కలుపుకొని 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.

నిర్మాణ రంగంలో ఈయన  కుమారుడు నష్టాల్లో కూరుకుపోవడంతో , మిగతా డబ్బులను రియల్ ఎస్టేట్ వెంచర్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇక వీరికి భారీగా భూములు ,పొలాలు ఉండటంతోపాటు చెన్నైలో పలు కాంప్లెక్స్ కూడా ఉండడంతో వాటిని రెంట్ కి ఇచ్చినట్లు సమాచారం. ఏకంగా 25 ఎకరాలలో ఫామ్ హౌస్ ను కూడా నిర్మించారు.. ఆయన తుది శ్వాస విడవడం తో ఆయన అంత్యక్రియలు కూడా అక్కడే నిర్వహించారు.. ఇక  ఒక్కో పాట పాడిన అప్పుడు రూ.5 లక్షలు రెమ్యునరేషన్ తీసుకునే వారట.ఇక 120 కోట్లు నెట్ క్యాష్ ఉన్నట్లు సమాచారం. కార్ల విషయానికొస్తే బీఎండబ్ల్యూ ,బెంజ్ , టయోటా వంటి అత్యంత ఖరీదైన కార్లు ఉన్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: