మరుపురాని, మరువలేని, మధురమైన మహా గాన గంధర్వుడు ఎస్.పి బాల సుబ్రమణ్యం. ఆయన మాట మధురం, పాట పరవశం, నటన అద్భుతం, సంగీతం అమోగం... ఇలా ఆ మహనీయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ లో మనకు దొరికిన పాటల అరుదైన ఆణిముత్యం ఆయన. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది. ఆయనకు సాటి ఎవరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకున్న గాయకుడు మన ఆరాధ్య దేవుడు మనల్ని వదిలి వెళ్లి అప్పుడే సంవత్సరం అయిపోయింది. ఇపుడే అర్దం అవుతోంది కాలం ఎంత వేగంగా సాగుతుందని, పోయిన ఏడాది ఇదే రోజున అనగా సెప్టెంబర్ 25 న కోట్లాది మంది అభిమానులను వీడి ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు ఎస్.పి బాలు.

తన స్వర మాధుర్యంతో మనల్ని మరో లోకానికి తీసుకెళ్ళి సంతోషాల స్మరణలో ఉర్రూతలూగించిన మన బాలు  గొంతు మూగబోయింది అంటే ఇప్పటికి నమ్మడం, ఆ విషయాన్ని జీర్ణించుకోవడం అసాధ్యంగానే ఉంది. 1966లో డిసెంబర్ 15 తేదీన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న అనే చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అప్పటి నుండి దశాబ్దాల తరబడి స్వర సేవ చేసి మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేసిన  శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గత ఏడాది కరోనా కారణంగా ఇదే రోజున తన తనువు చాలించారు. బాలు తిరిగి వస్తారు, తిరిగి రావాలి, ఆయన స్వరం మళ్ళీ వినాలి అని ఎంతగానో ఎదురు చూసిన మనల్ని శోకసంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాలకు తరలి వెళ్ళిపోయారు. ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా  ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఎంత మాట్లాడినా తనివి తీరదు. ఆయన సినీ పరిశ్రమకు గాయకుడిగా, నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడుగా సేవలు అందించి తన ప్రతిభను చాటుకున్నారు.


ఈ సందర్భంగా ఆయన నటించిన చిత్రాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. నటుడిగా 1969లో పెళ్లంటే నూరేళ్ల పంట అనే సినిమాతో తనలోని నటుడ్ని  పరిచయం చేశారు. అలా నటుడిగా కూడా  కెరీర్ ను ప్రారంభించిన బాలు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు. పక్కింటి అమ్మాయి, వివాహ భోజనంబు, ప్రేమ, చెన్నపట్నం చిన్నోడు, మిథునం, దేవస్థానం, కళ్లు,  ప్రేమికుడు, గుణ, పవిత్రబంధం వంటి చిత్రాల్లో అద్భుతమైన పోషించి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు. నటుడిగా ఆయన నటించిన చివరి చిత్రం దేవదాస్. వీటిలో ప్రతి చిత్రం ప్రత్యేకమే ముఖ్యంగా ప్రేమికుడు, పవిత్ర బంధం సినిమాలలో బాలు పోషించిన పాత్రలు తెలుగు ప్రేక్షకులు ఎన్నటికీ మరువలేనివి.

మరింత సమాచారం తెలుసుకోండి: