దిగ్గజ భారతీయ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మొదటి వర్ధంతి. సెప్టెంబర్ 25, 2020లో బాలు మరణించారు. ఆరు సార్లు జాతీయ అవార్డు విజేత అయిన ఈ దిగ్గజ గాయకుడు 1966లో తెలుగు సినిమా "శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న" సినిమాతో గాయకుడిగా అరంగేట్రం చేశారు. ఆ తరువాత ఆయన తన సంగీత వృత్తిని ప్రారంభించాడు. 16 విభిన్న భాషలలో పాటలను రికార్డ్ చేశాడు. ప్రధానంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో ఆయన పాడిన పాటలు ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అంతేకాదు ఈ దివంగత గాయకుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించారు. 40,000 పాటలకు పైగా రికార్డ్ చేసిన ఏకైక సంగీత కళాకారుడు ఎస్పీ బాలు. ఆయన వర్ధంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రముఖులతో పాటు అయన అభిమానులు కూడా బాలును గుర్తు తెచ్చుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన ఆరాధకులలో ఒకరైన మలయాళంలో ఫిక్షన్ రచయిత కెపి సుధీర తాను ఎంతో ఇష్టపడే గాయకుడు ఎస్పీ బాలు గురించి ఒక పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఇది ఆయన మొదటి వర్ధంతి సందర్భంగా శనివారం విడుదల కానుంది. హనీ కాంబ్ పబ్లిషర్స్ ద్వారా పబ్లిష్ అయిన ఈ బుక్ 400 పేజీలకు పైగా ఉంటుందట. అందులో ఎస్పీబీ జీవిత చరిత్రతో పాటు మరెన్నో విశేషాలు ఉండబోతున్నాయి.

ఈ పుస్తకంలోని ముఖ్యాంశాలలో కమల్, ప్రముఖ తమిళ లిరిసిస్ట్ వైరముత్తు వంటి ప్రముఖులు బాలు గురించి చెప్పిన కొన్ని అమూల్యమైన విషయాలను కూడా పొందు పరిచారు. కానీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తెలుగు చిత్రాలలో కమల్ హాసన్ కు బాలు ఎలా డబ్బింగ్ చెప్పాడు? వంటి ఆసక్తికర విషయాలను. ఆమె మదిలో కదిలే భావాలను, ఎస్పీబీతో వేదికను పంచుకున్న తన అనుభవాలను, ఆయన వినయం, దయ, హాస్య చతురతతో పాటు కరోనా సంక్రమించిన తర్వాత అతని మరణానికి కొద్దిసేపటి ముందు జరిగిన చర్యల గురించి ఈ బుక్ లో చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: