గాన గాంధార్వుడు... ఎస్పీ బాల సుబ్రమణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  తెలుగు, తమిళ, కన్నడు, హిందీ ఇలా ఎన్నో భాషల్లో తన పాటలతో అందరినీ కనిందు చేశారు ఎస్పీ బాల సుబ్రమణ్యం.  ఇప్పటి వర కు 40 వేలకు పైగా పాటలు పాడారు  ఎస్పీ బాల సుబ్రమణ్యం.  పాటలు పాడటమే కాక.. ఎంతో మందికి డబ్బింగ్‌ కూడా చెప్పారు. అయితే.. ఎస్పీ బాలు మృతి కి ముందు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా చాలా ఆసక్తి కర విషయాలను పంచుకున్నారు.  తన లైఫ్ కు సంబంధించి కొ న్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.   

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ లో అసలు నిర్మాతలకు గౌరవం అనేది లేదని పేర్కొన్నారు. అంతేకాదు చిత్ర పరిశ్రమలో కుల పిచ్చి బాగా పెరిగిపోయిందని... కులాల పేర్లు చెప్పు కుంటూ తిరుగుతున్నారని బాల సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఇక చాలా మంది సింగర్స్ ను... తాను ఎదగ నియా లేదని... కొంత మంది దారుణంగా ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశా రు బాల సుబ్రమణ్యం. అలా చాలా మంది చేసిన ఆరోపణల కారణంగా తన మనస్సు చాలా బాధపడింది అని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్పీ బాల సుబ్రమణ్యం.

 తన సంతానంలో ఒక అమ్మాయి హౌస్ వైఫ్ అని... తమ కొడుకు బిజినెస్ మేనే జ్మెంట్ చేశాడని చెప్పుకొచ్చారు బాలసుబ్రమణ్యం. అయితే తమ అబ్బాయి మరియు అమ్మాయికి కూడా కవలలు జన్మించారని పేర్కొన్నారు. ఇం ట్లో తనను ఎప్పుడు కవలల తాతయ్య అని పిలిచేవారని చెప్పుకొచ్చారు బాలసుబ్రమణ్యం. మీ చివరి కోరిక ఏమిటని రిపోర్టర్ అడగగా... దానికి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు బాలసుబ్రమణ్యం. ఓపిక ఉన్నంత వరకు పాటలు పాడుతూనే ఉండాలని... చావు అంటే తెలియకుండా మృతి చెందాడని  బాల సుబ్ర హ్మణ్యం తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: