తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు 25 కు పైగా పురస్కారాలను అందుకుని ఎవరికీ సాధ్యం కాని విధంగా ఆయన ఈ ఘనత సాధించి ప్రేక్షకులలో గొప్ప కీర్తి దక్కించుకున్నారు బాలసుబ్రహ్మణ్యం. తనలాగే ఎంతో మంది గాయకులు ఉన్నారని సరైన వేదిక కల్పిస్తే మంచి గాయకులు అవుతారని చెప్పి టీవీ రంగంలో ఆయన పాడుతా తీయగా అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ గాయకులను పరిచయం చేశాడు. 1996లో మొదలైన ఈ షో ఇప్పటికీ ప్రసారం అవుతుండటం విశేషం.

2001లో పద్మశ్రీ పురస్కారాన్ని 2011లో పద్మభూషణ్ పురస్కారాన్ని 2021లో ఆయన మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నాడు బాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాలలో నంది పురస్కారాన్ని గెల్చుకున్నారు. 1946 జూన్ 4వ తేదీన నెల్లూరు జిల్లాలో జన్మించిన బాలసుబ్రహ్మణ్యం 1964లో సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీలో పోటీ చేసి మొదటి ప్రైజ్ అందుకుని అక్కడికి అతిథులుగా విచ్చేసిన ప్రముఖ సంగీత దర్శకుల కళ్ళల్లో పడ్డారు.

అలా సంగీత దర్శకుడు ఎస్.పి.కోదండపాణి సినిమాల్లో అవకాశం కల్పిస్తామని బాలు కి మాట ఇచ్చారు.  చదువుతుండగానే బాలసుబ్రహ్మణ్యం చిత్ర రంగ ప్రవేశం చేశాడు. ఆ తరువాత ఆయన పాడనీ పాట వ్యర్థం అనేలా తయారయింది పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కరోనా కారణంగా ఆయన గత సంవత్సరం మరణించగా ఈ రోజుతో ఆయన పరమపదించి సంవత్సర కాలం అయ్యింది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ మీడియా సంస్థ సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డు లో భాగంగా సాక్షి మీడియా గ్రూప్ దివంగత ప్రముఖ గాయకులు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం కు లైఫ్ టైం అవార్డు 2020 సంవత్సరానికి గాను ఇచ్చి ఆయనను సత్కరించింది. దీని గురించి బాలు కుమారుడు స్పందించాడు. నాన్నకు గుర్తుపెట్టుకుని ఇంత గొప్ప అవార్డు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. దురదృష్టవశాత్తు మా కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. అందుకు వివిధ కారణాలు ఉన్నాయి. కానీ మనసంతా అక్కడే ఉంది. మా తరఫున ఈ అవార్డును స్వీకరిస్తున్న సంగీత దర్శకుడు మణిశర్మ గారికి ధన్యవాదాలు అని ఆయన వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: