తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హాస్యనటుడు ఆలీ అని చెప్పవచ్చు.. ఈయన తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసి , ఒక గొప్ప హాస్యనటుడిగా గుర్తింపు పొందాడు. ఆలీ కేవలం హాస్య నటుడు మాత్రమే కాదు హీరో కూడా.. సినీ ఇండస్ట్రీలో మొదటి సారి ఒక కమెడియన్ హీరో గా అవ్వడం ఈయన నుంచి నేర్చుకున్నారు చాలామంది.. కమెడియన్ గా, నటుడిగా ఒక మంచి గుర్తింపు పొందిన ఆలీ దాదాపు 1, 2 సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారని చెప్పాలి.

ఎందుకంటే ఆయన ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా అనే ఒక రియాల్టీ షో ని నిర్వహిస్తూ,  పెద్ద పెద్ద సినీ ప్రముఖులను ఈ షో కి పిలిచి , వారి జీవిత విషయాలను ప్రేక్షకులకు తెలియజేస్తూ ఉంటాడు.. ఈ సందర్భంగా ఏకంగా 250 ఎపిసోడ్ ను జరుపుకుంటోంది ఈ షో.. ఇక ఈ షో కి అతిముఖ్య అతిథిగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా రాబోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఆలీ కామెడియన్ గా చేస్తున్నప్పుడు రోజుకు రెండు నుంచి మూడు లక్షలు రూపాయలు రెమ్యూనరేషన్ గా తీసుకునే వారు..

ఇక ఆయన ఇల్లు ఒక ఇంద్ర భవనంలా ఉంటుంది. ఇక ఆ ఇంటి గురించి మనం కూడా ఒకసారి చదివి  తెలుసుకుందాం.. నిజానికి అభిమానులు తమ నటీనటులు ఎలాంటి ఇళ్లల్లో నివసిస్తున్నారు.. వారి ఇల్లు ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే . ఈ నేపథ్యంలోనే యూట్యూబ్ లో హోం టూర్ పేరిట చాలామంది తమ తమ ఇళ్లను అభిమానులకు చూపిస్తూ వస్తున్నారు.. ఇక ఇటీవల హోమ్ టూర్ లో నెంబర్ వన్ ప్లేస్లో ఉంది ఆలి ఇల్లు మాత్రమే.. ఇక ఆయన భార్య జుబేదా.. తమ ఇంటికి సంబంధించిన ఒక వీడియో చేసి తాజాగా యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.

ఆలీ, జుబేదా ఇద్దరు ఇంట్లోకి ఆహ్వానం పలికి, ఇక జుబేదా తను ప్రతి రూమును ఎంతో ఆకర్షణీయంగా, అందంగా దగ్గరుండి డిజైన్ చేయించుకున్నారని తెలిపింది.ఇక ఆ వీడియోను మీరు కూడా ఒకసారి చూసేయండి.



మరింత సమాచారం తెలుసుకోండి: