టాలీవుడ్ న‌టుడు బండ్ల గ‌ణేష్ మా ఎన్నిక‌ల్లో జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప‌ద‌వి కోసం పోటీలోకి దిగుతున్న సంగ‌తి తెలిసిందే. మొద‌ట ప్ర‌కాష్ రాజ్ కే త‌న ఫుల్ స‌పోర్ట్ అని చెప్పిన బండ్ల ఆ త‌రావాత చోటుచేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌కాష్ రాజ్ కు నో చెప్పి తానే సింగిల్ గా రంగంలోకి దిగుతూ జ‌న‌రల్ సెక్ర‌ట‌రీ ప‌ద‌వికి పోటీచేస్తున్నా అంటూ ప్ర‌క‌టించారు. అంతే కాకుండా  ప్ర‌కాష్ రాజ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ గ‌తంలో అధ్య‌క్ష‌ప‌దవిలో ఉన్న‌వారిపై విమ‌ర్శ‌లు కురిపించారు. ఇక బండ్ల అప్ప‌ట్లో అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం లో త‌న దూకుడు ప్ర‌ద‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు మా ఎన్నిక‌ల‌లోనూ బండ్ల గ‌ణేష్ అదే దూకుడుతో క‌నిపిస్తున్నారు. 

అంతే కాకుండా ఇప్ప‌టికే ప్ర‌కాష్ రాజ్, మంచు విష్ణు లు త‌మ ప్యాన‌ల్ ల‌ను ప్ర‌క‌టించగా తాజాగా నిన్ని రాత్రి బండ్ల గ‌ణేష్ త‌న ఫోటోతో ఓ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. ఆ పోస్ట‌ర్ లో బండ్ల గ‌ణేష్ అధ్య‌క్ష ప‌ద‌వికి మీకు న‌చ్చిన వారికి ఓటువేసుకోండి. వైస్ ప్రెసిడెంట్ ప‌ద‌వికి మీకు న‌చ్చిన‌వారికి ఓటు వేసుకోండి. జాయిట్ సెక్ర‌ట‌రీ, ఎక్జిక్యూటివ్ మెంబ‌ర్స్ అంతా మీ ఇష్టం కానీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ఓటు మాత్రం నాకే వేయండి అంటూ బండ్ల గ‌ణేష్ ప్ర‌చారం మొద‌లు పెట్టారు. నా గెలుపు మా కోసం..మ‌న కోసం, మనంద‌రి కోసం అంద‌రి త‌ర‌పుణ ప్ర‌శ్నించ‌డం కోసం. 

ద‌య‌చేసి నాకు ఓటు వేయండి స‌దా మా మీ సేవ‌లో బండ్ల గ‌ణేష్ అంటూ పేర్కొన్నారు. అదే విధంగా పోలీంగ్ తేదీని పోలింగ్ స్థ‌లాన్ని బండ్ల గ‌ణేష్ త‌న ట్వీట్ లో ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా ఎక్క‌డ ఉన్న బండ్ల గ‌ణేష్ దూకుడు మాత్రం కామ‌న్ పాయింట్ అన్న సంగ‌తి తెలిసిందే. న‌చ్చింది మాట్లాడుతూ బండ్ల గ‌ణేష్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటారు. అంతే కాకుండా బండ్ల గ‌ణేష్ కు అత‌డి వాయిస్ ఎంతో ప్ల‌స్ కాబ‌ట్టి ఈ ఎన్నిక‌ల్లో బండ్ల గెలిచే అవకాశాలు ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: