అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ కి మొదటి సినిమానే పెద్ద దెబ్బ కొట్టింది. భారీ బడ్జెట్ తో వచ్చిన అఖిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద బోల్తా పడింది.ఆ తర్వాత రి లంచ్ అని విక్రమ్ కె కుమార్ డైరెక్టర్ గా హలో సినిమా తీశారు. ఆ సినిమా కూడా ప్లాప్ అయ్యింది.ఇక లాభం లేదు అని ఒక మంచి లవ్ స్టొరీతో అన్న జనాలని అలరించాలి అని అఖిల్ మిస్టర్ మజ్ను సినిమాతో జనాల ముందుకు వస్తే దాన్ని కూడా తిప్పికొట్టారు.

అయితే ఆయన ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ ఏలిజిబుల్ బ్యాచులర్ సినిమాకి విడుదలకు ముందే ఎన్నో ఆటంకాలు.చివరి సంవత్సరమే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోన వలన పోస్ట్ పోన్ ఐతు వచ్చింది. ఇక ఫైనల్ గా అక్టోబర్ 8న విడుదల చేయబోతున్నాం అని మూవీ టీం ప్రకటిస్తే ఇప్పటికే రిలీజ్ చేస్తున్నారు లే అని అందరూ అనుకున్నారు. అయితే ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం అయితే ఈ సినిమా అప్పుడు కూడ విడుదల అవ్వట్లేదు అని టాక్. దీనికి కారణం ఇంకా ఈ సినిమా పని పూర్తి అవ్వలేదట. షూటింగ్ ఎప్పుడో పూర్తియన ఈ సినిమా ఎడిటింగ్ కి వచ్చేసరికి చాలా మార్పులు చేశారట. కొన్ని సీన్స్ ని రీషూట్ కూడా చేసారని టాక్. దీనికి కారణం నిర్మాత అల్లు అరవింద్ కి ఈ సినిమా ఔట్ ఫుట్ నచలేదట.

ఇక ఈ సినిమాలో పూజ హెగ్డే నటిస్తుంది అనే మాటనే కానీ అసలు ఎవరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ని పట్టించుకోవట్లేదు. ఈ సినిమా పాటలు అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి విడుదల చేయడం తప్ప ప్రమోషన్స్ కూడా పెద్దగా చేసింది ఏమి లేదు. ఇక అఖిల్సినిమా గురించి పట్టించుకోకుండా సురేందర్ రెడ్డి ఏజెంట్ సినిమాలో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: