పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో స‌లార్ సినిమా వ‌స్తుంద‌న్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా పై రోజు రోజుకు అభిమానుల్లో అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. ప్ర‌భాస్ చేస్తున్న‌ సినిమా కాబట్టి భారీ అంచ‌నాలే ఉంటాయి. పైగా హీరో య‌ష్ కు కేరీయ‌ర్ లోనే బెస్ట్ సినిమా అయిన కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ఈ సినిమా కు ద‌ర్శ‌క‌త్వం వహించ‌డంతో ఈ సినిమా పై ఇంకా హైప్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమా కోసం ప్ర‌భాస్ అభిమానుల‌కు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా త‌ప్ప‌కుండా బాక్సాఫీస్ ను షేక్ చేయ‌డం ఖాయం మ‌ని సిని విశ్లేష‌కులు కూడా చెబుతున్నారు.




అయితే తాజా గా స‌లార్ సినిమా గురించి ఒక అదిరిపోయిన అప్ డేట్ వ‌చ్చింది. ఈ సినిమా కు హాలీవుడ్ టెక్నాల‌జీ ని వాడుతున్నార‌ని తెలుస్తోంది. దీంతో అన్ని సినిమా ల కంటే హాలీవుడ్ టెక్నాల‌జీ ని వాడే సినిమాలు కాస్త బాగుంటాయి. అంతే కాకుండా ఇంత వ‌ర‌కు భార‌త దేశం లోనే ఎప్పుడు వాడ లేని హై ఎండ్ హాలీవుడ్ టెక్నాలజీ ఈ సినిమా కు వాడుతున్నార‌ట‌. హాలీవుడ్ లో వ‌చ్చిన మ్యాట్రిక్స్, బ్యాట్ మెన్ వంటి సినిమాల‌కు ఉప‌యోగించిన టెక్నాల‌జీ ని స‌లార్ కు ఉప‌యోగిస్తున్నార‌ట‌. ఈ వార్త నిజం అయితే భార‌తీయ సినిమా ప్రియుల‌కు ఒక కొత్త అనుభావం క‌లుగుతుంది.




ఇదిలా ఉండ‌గా స‌లార్ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం ముంబాయ్ న‌గ‌రంలో జ‌రుగుతుంది. ఈ సినిమా లో యంగ్ రెబ‌ల్ స్టార్ స‌ర‌స‌న బ్యూటీ ఫుల్ హీరోయిన్ శృతి హాస‌న్ న‌టిస్తుంది. ఈ సినిమాను హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్ పై విజ‌య్ కిర‌గందూర్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా భారీ బ‌డ్జెట్ తో రూపోందిస్తున్నారు. అయితే ఈ సినిమా వ‌చ్చే సంవత్స‌రం ఏప్రిల్ 14న అన్ని భాషాల‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా థీయేట‌ర్ ల‌లో విడుద‌ల చేయ‌నున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: