మాస్ మహారాజా రవితేజ ఈ సంవత్సరం క్రాక్ మూవీ తో మంచి విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. అయితే అదే ఊపులోనే మరొక బ్లాక్ బస్టర్ అందుకోవాలని ఉద్దేశంతో రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఖిలాడి' అనే మూవీలో  హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దేశంలో కరోనా విజృంభించడంతో వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈ సినిమా నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను, ఒక లిరికల్ సాంగ్ ను చిత్ర బృందం జనాల ముందుకు తీసుకు వచ్చింది. వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా, ఈ మూవీ పై ఉన్న అంచనాలు మరింతగా పెంచాయి. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాపై రీసెంట్ గా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఈ చిత్రానికి ఫైనాన్సియల్ ఇబ్బందులు వచ్చాయని, ఆ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి.

కానీ ఆ సమయంలో ఈ వార్తలపై చిత్రయూనిట్ ఏమాత్రం స్పందించలేదు. లేటెస్ట్ గా ఈ వార్తలపై స్పందించిన 'ఖిలాడి' చిత్రయూనిట్ ఒక అప్డేట్ ను బయటకు వదిలారు. మూవీ టాకీ పార్ట్ అంతా పూర్తయిందని, రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని తెలియజేశారు. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ డ్యూయల్ రోల్ పోషించబోతున్నారు. ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నాడు. హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై స‌త్య‌నారాయ‌ణ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవితేజ ఈ చిత్రం తో పాటు 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ పవర్ఫుల్ ఎమ్మార్వో పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: