మన హీరోలకు సినిమాల్లో నటించడం తప్ప.. మరే ధ్యేస లేదు అనుకుంటున్నారా..? అలా అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే కేవలం నటనతోనే సరిపెట్టుకోకుండా రకరకాల వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. ఒకవేళ సినిమాలు హిట్ అయినా.. ఫట్ అయినా.. సైడ్ వచ్చే ఇన్ కమ్ తో సంతృప్తి చెందేలా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లు కట్టిస్తూ.. ఆ వ్యాపారంలో దూసుకెళ్లేందుకు ప్లాన్ లు చేస్తున్నారు.  

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటనలోనే కాదు.. ప్రొడక్షన్, మల్టీప్లెక్స్‌ బిజినెస్ కూడా చేస్తున్నాడు.  హైదరాబాద్‌ నగరంలోని గచ్చిబౌలిలో ఏషియన్‌ గ్రూప్‌తో కలిసి 'ఎఎమ్‌బి' సినిమాస్ అనే మల్టీప్లెక్స్‌ నిర్మించాడు. ఈ మల్టీప్లెక్స్‌ ఇంటీరియర్‌ని మహేశ్‌ బాబు చాలా రిచ్‌గా డిజైన్‌ చేయించాడు. దీంతో ఈ మల్టీ ప్లెక్స్ వచ్చే ప్రేక్షకులు.. ఫోటోలు తీసుకుంటూ సంబరపడిపోతుంటారు.

ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ కూడా.. పెద్ద పెద్ద సినిమాలు చేయడమే కాదు.. అందుకు తగ్గట్టుగా మల్టీప్రెక్స్ లు కూడా కట్టించాడు. నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటలో వి-ఎపిక్ పేరుతో ఫ్రెండ్స్‌తో కలిసి ఒక మల్టీప్లెక్స్‌ నిర్మించాడు. ఈ మల్టీప్లెక్స్‌లో ఉండే స్క్రీన్ మన భారత దేశంలోనే అతిపెద్దది కావడం విశేషం. ఈ స్క్రీన్‌లో సినిమా చూసిన వారంతా థ్రిల్ గా ఫీలవుతుంటారు.
 
ముఖ్యంగా అల్లు అర్జున్ పాన్ ఇండియన్ హీరోగా మార్కెట్‌ పెంచుకునేందుకు చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు. ప్రేక్షకులను  లార్జ్‌స్కేల్లో థియేటర్‌ అనుభవాన్ని అందించేందుకు మల్టీప్లెక్స్‌ కట్టిస్తున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హైదరాబాద్‌ అమీర్‌పేటలో ఏషియన్‌ గ్రూప్‌తో కలిసి మల్టీప్లెక్స్‌ కట్టిస్తున్నాడు. సత్యం థియేటర్‌ స్థానంలో ఈ కొత్త మల్టీప్లెక్స్ నిర్మాణం జరుగుతుండటం విశేషం. .

విజయ్ దేవరకొండ రౌడీ వేర్‌తో గార్మెంట్స్‌ బిజినెస్‌లోకి వచ్చాడు. కింగ్ ఆఫ్ ది హిల్ బ్యానర్ పేరుతో సినిమాలు కూడా నిర్మించాడు. అంతేకాదు మహబూబ్ నగర్‌లో ఏషియన్ గ్రూప్‌తో కలిసి ఒక మల్టీప్లెక్స్ కట్టించాడు. 'ఏవిడి-ఏషియన్ విజయ్ దేవరకొండ' పేరుతో మొదలైన ఈ మల్టీప్లెక్స్‌లో తొలి సినిమాగా లవ్ స్టోరీ ప్రదర్శితమవుతోంది.






మరింత సమాచారం తెలుసుకోండి: