అక్కినేని ఫ్యామిలీ లో మూడో తరం వారసుడిగా వెండితెరకి ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య.ఇక ఇటీవలే తన 12 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు ఈ అక్కినేని హీరో.ఈ 12 ఏళ్ల కాలంలో చైతూ కెరీర్లో ఎన్నో జయాలు, అపజయాలు అందుకున్నాడు.హీరోగా కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలు కూడా చేసాడు. అయితే ఇన్నేళ్ల తన సినీ కెరీర్లో హ్యాట్రిక్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు చైతూ.అయితే ఇప్పుడు తాను తాజాగా నటించిన 'లవ్ స్టోరీ' సినిమాతో ఆ ఫీట్ ని విజయవంతంగా పూర్తి చేశాడు.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా విడుదలై హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఇక లవ్ స్టోరీ కంటే ముందు చైతూ నటించిన గత రెండు చిత్రాలు 'మజిలీ, వెంకీ మామా'. ఈ రెండు సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న నాగ చైతన్య ఇక తాజాగా విడుదలైన 'లవ్ స్టోరీ' సినిమాతో కెరీర్లో ఫస్ట్ హ్యాట్రిక్ ని సొంతం చేసుకున్నాడు.ఇక గతంలో కొన్ని సార్లు హ్యాట్రిక్ హిట్ ని మిస్ చేసుకున్నాడు చైతూ.అందులో 'ఏమాయ చేసావే, 100 % లవ్ సినిమాలతో రెండు వరుస విజయాలను సొంతం చేసుకున్న చైతూ.. ఆ తర్వాత 'దడ' సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో.. కొంచం లో ఈ అక్కినేని హీరోకి హ్యాట్రిక్ మిస్సయింది.ఇక ఆ తర్వాత 'తడాఖా, మనం' సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ని సొంతం చేసుకున్నప్పటికీ..

 'ఆటోనగర్ సూర్య'సినిమా నిరాశపడచడంతో మరోసారి మూడవ విజయాన్ని అందుకోలేకపోయాడు.అలా తన కెరీర్లో రెండు సార్లు హ్యాట్రిక్ మిస్ చేసుకున్న చైతూ...ఎట్టకేలకు 'మజిలీ, వెంకీ మామా,లవ్ స్టోరీ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకొని కెరీర్లో తొలిసారిగా హ్యాట్రిక్ సాధించి వార్తల్లో నిలుస్తున్నాడు.ఇక ప్రస్తుతం తన కెరీర్ పరంగా బెస్ట్ ఫేజ్ లో ఉన్న నాగ చైతన్య రాబోయే రోజుల్లో కూడా అదే హిట్ మ్యానియా ని కొనసాగిస్తారేమో చూడాలి.ఇక చైతూ ప్రస్తుతం నటిస్తున్న 'థాంక్యూ', 'లాల్ సింగ్ చద్దా', 'బంగార్రాజు' సినిమాలతో ఈ విజయపరంపరని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు అక్కినేని అభిమానులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: