మెగాస్టార్ చిరంజీవి అంటే టాలీవుడ్ ఇండ‌స్ట్రీ లోనే అగ్ర క‌థ‌నాయ‌కుడు. చిరంజీవి తో సినిమాలు చేయాల‌ని డైరెక్ట‌ర్లు, ప్రోడ్యూస‌ర్లు, అలాగే చాలా మంది హీరోయిన్ లు కోరుకుంటారు. మెగాస్టార్ తో సినిమా అంటే అది త‌మ జీవితం లోనే అతి పెద్ద అచీవ్ అని అనుకుంటారు. అంతే కాకుండా మెగాస్టార్ చాలా మంది చిన్న హీరోలు కూడా ఆద‌ర్శంగా తీసుకుంటారు. ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి వ‌రుస సినిమా ల‌తో బిజీ గా ఉన్నారు. డేట్స్ ను అజెస్ట్ చేసుకుంటు వ‌రుస‌గా క‌థ ల‌కు ఓకే చెబుతున్నారు. అంతే స్పీడ్ గా సినిమాల‌ను కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఎంత‌లా అంటే వ‌చ్చే ఏడాది మెగాస్టార్ చిరంజీవి సినిమాలు మూడు విడుద‌ల కాబోతున్నాయి.
ఇదీల ఉండ‌గా చిరంజీవి తో సినిమాలు చేయాల‌ని చాలా మంది హీరోయిన్ లు క‌ల‌లు కంటు ఉంటారు. ప్ర‌స్తుతం మిల్కీ బ్యూటీ త‌మ‌న్న మ‌రో సారీ అవ‌కాశం ద‌క్కించుకుంది. ఇది వ‌రకే మెగా స్టార్ స‌ర‌స‌న ఒక సినిమా చేసింది. చిరంజీవి హీరో వ‌చ్చిన  సైరా న‌ర‌సింహా రెడ్డి సినిమాలో మెగాస్టార్ కు జోడి గా త‌మ‌న్నా న‌టించింది. ఇప్పుడు మ‌ళ్లి మెగాస్టార్ తో న‌టించ‌డానికి సిద్ధ‌మ‌యింది. త‌మిళం లో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం సినిమాను మెగాస్టార్ చిరంజీవి రీమెక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర‌కు మిల్కీ మ్యూటీ త‌మ‌న్నా ను చిత్ర యూనిట్ సెల‌క్ట్ చేసింది. అయితే మొద‌ట ఈ సినిమా కు హీరోయిన్ గా శృతి హాస‌న్ గా అనుకున్నారు. వ‌రిజ‌న‌ల్ సినిమాలోనూ శృతి హాస‌నే హీరోయిన్ గా న‌టించింది. ఇప్పుడు కూడా త‌న‌నే అనుకున్నారు. కానీ శృతి హాస‌న్ డేట్స్ ప‌రంగా కుద‌ర‌క పోవ‌డం తో త‌మ‌న్నా ను ఎంచుకున్నారు.
ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి వ‌ర‌స సినిమా ల‌తో బిజీ గా ఉన్నాడు. డైరెక్ట‌ర్‌ కొర‌టాల  శివ‌తో ఆచార్య సినిమా చేస్తున్నాడు. అలాగే మోహ‌న్ రాజాతో లూసిఫ‌ర్ రీమెక్ గాడ్ ఫాద‌ర్ చేస్తున్నాడు. వీటితో వేద‌ళం రీమెక్ భోళా శంక‌ర్ సినిమా ను డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్ తో తీస్తున్నాడు. అలాగే బాబీ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా కూడా చేస్తున్నాడు. మొత్తం నాలుగు సినిమా ల‌తో మెగాస్టార్ చిరంజీవి బిజీ గా ఉన్నాడు. ఇప్ప‌టికే ఆచార్య షూటింగ్ దాదాపు పూర్తి అయింది. అలాగే ఊటీలో ప్ర‌స్తుతం గాడ్ ఫాద‌ర్ సినిమా షూటింగ్ జ‌రుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: