బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్,ఎలిమినేషన్ అనే ప్రక్రియలు ఎంత ఉత్కంఠ భరితంగా ఉంటాయో తెలిసిందే ఇక తాజా సీజన్ లో మాత్రం ఈ ప్రక్రియలు ఎంతో రసవత్తరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడో వారం జరిగిన నామినేషన్స్ వల్ల ఈసారి ఎలిమినేషన్ తల క్రిందులు అయ్యేలా కనిపిస్తోంది.ప్రియ ,యాంకర్ రవి వల్ల లహరి బ్యాడ్ అయ్యింది.యాంకర్ రవి ఆడిన డబుల్ గేమ్ వల్ల అటు ప్రియ, ఇటు లహరి ఇద్దరూ కూడా సఫర్ అయ్యారు.అది ఎలా అంటే..రవి..ప్రియతో నామినేషన్స్ కంటే ముందు లహరి గురించి మాట్లాడారు.'ఆమె యాంకరింగ్ కోసం ట్రై చేస్తుంది.కానీ సింగిల్ మెన్ ను వదిలేసి నా వెంట పడుతుంది.

ఆమెకు ఎలా చెప్పాలో తెలియడం లేదు' అంటూ చెప్పాడు.దీన్ని మనసులో పెట్టుకున్న ప్రియ..లహరి మీద ఓ కన్నేసి ఉంచింది.ఈ క్రమంలోనే రవి, లహరి రాత్రి పూట వాష్ రూమ్ దగ్గర హగ్ చేసుకోవడాన్ని చూసింది.ఇక నామినేషన్స్ లో ఈ హగ్ విషయాన్ని ప్రస్తావిస్తూ..'నువ్వు మగాళ్లతో బిజీ అని లాహరికి చెప్పింది.ఇక ఆ గొడవ పెద్దగా మారి అందులో రవి ఇరుక్కున్నారు.అయితే తాను సింగిల్ మెన్ అనే మాటే అనలేదని ప్లేట్ పిరాయించాడు.నువ్వు అన్నావ్ కదా అని ప్రియ నిలదీసినప్పటికి తను అనలేదని బుకాయించాడు రవి.ప్రియ తనను బ్యాడ్ చేయడానికి ఇలా చేస్తోందని, తనకి ఫ్యామిలీ ఉందని,ఓ కూతురు కూడా ఉందని సెంటిమెంటు డైలాగులు చెప్పడంతో..

 రవి తప్పు లేదని లహరి నమ్మేసింది.ఇక ఈ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున..రవిని..ప్రియ తో లహరి గురించి సింగిల్ మెన్ అని అన్నవా?లేదా? అని అడిగాడు.వెంటనే రవి అన్నాను సర్.. అని మరోసారి మాట మార్చాడు.దీంతో షాకైనా ప్రియ..ఇప్పటివరకు ఆ మాట అన్నానని రవి ఒప్పుకోలేదు సర్ అని చెప్పింది.ఆ తర్వాత ఈ విషయం గురించి మరింత క్లారిటీ ఇవ్వడానికి లహరి ని పవర్ రూమ్ కి పంపించాడు నాగ్.ఇక అందులో రవి లహరి గురించి బ్యాడ్ గా మాట్లాడిన వీడియో చూపించడంతో అతడి నిజ స్వరూపం బయటపడింది.ఇక ఆ ప్రోమో చూసిన నెటిజన్స్ రవికి బుద్ధి చెప్పే సమయం దగ్గర పడిందని కామెంట్స్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: