టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దర్శకుడు శేఖర్ కమ్ముల కు ఫీల్ గుడ్ దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఆయన ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలు అన్ని ప్రేమ కథ చిత్రాలు ఫీల్ గుడ్ నేపథ్యమున్న చిత్రాలే కావడం విశేషం. జోనర్ ఏదైనా కూడా తనదైన స్టైల్ లో మంచి ఫీల్ తో సినిమాలు చేసి చూపించి దాన్ని విడుదల చేస్తాడు. ఆఖరికి సీరియస్ జోనర్ లోని పొలిటికల్ నేపథ్యం ఉన్న సినిమాని కూడా ఆయన ఫీల్ గుడ్ చిత్రం గా తెరకెక్కించాడు అంటే ఆయన ఏ రేంజ్ లో సినిమా కపై తన ప్రభావాన్ని చూపిస్తాడో అర్థం చేసుకోవచ్చు.

ఇటీవలే ఆయన లవ్ స్టోరీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి కథానాయికగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను భారీగా ఆకట్టుకోగా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది ఇది. ముఖ్యం గా ఫ్యామిలీ ప్రేక్షకులు సైతం ఈ సినిమాకు వస్తుండడంతో కరోనా తరువాత చాలా రోజులకు సినిమా పరిశ్రమ మళ్లీ గాడిలో పెట్టిన సినిమా గా లవ్ స్టోరీ చిత్రాన్ని అభివర్ణిస్తున్నారు. ఈ సినిమాలో అందరికంటే ఎక్కువగా దర్శకుడు శేఖర్ కమ్ముల కి ఎక్కువ పేరు రావడం విశేషం.


ఇకపోతే ఈ సినిమాలోని కొన్ని లోపాలను ప్రేక్షకులు ఎత్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రేక్షకులను కొంత బోర్ కొట్టిస్తుందనీ, క్లైమాక్స్ కూడా చాలా తేలిపోయిందని అందరూ అంటున్నారు. కాకపోతే ఈ లోపాలు ఫస్టాఫ్ ఎంటర్టైన్మెంట్ వల్ల ప్రేక్షకులను ఏ విధంగానూ బోర్ కొట్టేలా చేయవు అని కూడా వారే చెబుతుండడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మరొకసారి తన వీక్ నేస్ ను బయటపెట్టుకున్నాడు శేఖర్ కమ్ముల. అదేమిటంటే తన ప్రతి సినిమా కూడా ఎంతో ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. కానీ ద్వితీయార్థం లో సినిమా కొంత నెమ్మదిస్తుంది అని ఆయనకు ఓ అపవాదు ఉండేది.  ఇప్పుడు ఈ సినిమాతో ఇది మళ్లీ నిరూపితం అయింది. మరి భవిష్యత్తులో అయినా శేఖర్ కమ్ముల ఈ వీక్ నెస్ ను సరి చేసుకుంటాడా అనేది చూడాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: