హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకొని వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతోంది. ఈ సినిమా హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పవర్ స్టార్  కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు అనే మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. ఇలా క్రేజీ మూవీస్ తో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకుంటూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ తన సోషల్ మీడియా వేదికగా తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను అప్లోడ్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు ఉంటుంది. 

ఇలా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండే నిధి అగర్వాల్ గత కొన్ని రోజులుగా అంత యాక్టివ్గా లేకుండా సోషల్ మీడియా కు దూరంగా ఉంది. ఇలా దూరంగా ఉండడం ఇష్టం లేని నిధి అగర్వాల్ తన అభిమానులకు ఒక పొల్ పెట్టింది. అ పొల్ లో నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం నీకు ఇష్టమేనా అంటూ ఒక ప్రశ్నను తన అభిమానులకు వేసింది. దానికి 93 శాతం మంది ఆక్టివ్ గా ఉండమని సమాధానం ఇచ్చారు. దానితో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి అని నిర్ణయించుకున్నా నిధి అగర్వాల్, తన జీవితంలో ఉన్న పన్నెండు రహస్యాలను తన 12 మిలియన్ ఫాలోవర్స్ లకు, ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు తెలియజేస్తాను అని తెలియజెప్పింది. దానిలో భాగంగా తన జీవితంలోని మూడవ సీక్రెట్ ను ఈరోజు రివీల్ చేసింది. తాను రోజు ఉదయాన్నే నిమ్మకాయ వేడి నీళ్లు తాగుతాను అని చెప్పుకొచ్చింది. సహజ సిద్దమైన వెనిగర్ వంటిదని నిధి అగర్వాల్ తెలిపింది. మన జీర్ణశక్తిని పెంచుతుందని అలాగే రోజంతా ఎనర్జీ గా ఉండడానికి సహా ఇది సహాయపడుతుందని నిధి అగర్వాల్ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: