అక్కినేని నాగచైతన్య ఇటీవలే లవ్ స్టొరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కగా అద్భుతమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం వీరందదరికీ మరిచిపోలేని హిట్ ను అందజేసింది. ఈ సినిమాలో నాగ చైతన్య తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోగా శేఖర్ కమ్ముల తన దర్శకత్వ ప్రతిభతో అందరిని మెప్పించాడు.

కరోనా తరువాత టాలీవుడ్ లో ఏ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించిన నేపథ్యంలో లవ్ స్టోరీ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది థియేటర్లకు రప్పిస్తుంది అని ఆశాభావంతో మొదటినుంచి చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తుండగా వారి ఎదురు చూపులకు ఫలితంగా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు సినిమా థియేటర్లకు వచ్చేలా చేస్తుంది. ఇప్పటివరకు ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే సినిమా థియేటర్లకు తరలిరాగా ఇంకొక వర్గం పూర్తిగా సినిమా లకు దూరం అయిపోయింది. ఆ వర్గం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం లో లవ్ స్టోరీ చిత్రం సక్సెస్ అయింది అని చెప్పాలి.

సినిమా హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ విధమైన రెస్పాన్స్ ఉంది అంటే పొరపాటే. మొదటి నుంచే సినిమా విడుదలైన మొదటి నుంచి ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లకు రావడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ రికార్డు ను చెరిపేశాడు చైతు. కరోనా రెండవ దశ తరువాత  వకీల్ సాబ్ చిత్రం అత్యధిక ప్రీమియర్ కలెక్షన్లను సాధించగా ఆ తర్వాత లవ్ స్టోరీ చిత్రం దానికి మించిన కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇది చాలు సినిమా ధియేటర్ లకు అందరూ ఫ్యామిలీ తో కలిసి వస్తున్నారని ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పడానికి. ఏదేమైనా సినిమా పరిశ్రమకు మంచి ఊపు తెచ్చిన సినిమా లవ్ స్టోరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: