టాలీవుడ్ యంగ్ దర్శకులలో ఒకరైన శివ నిర్వాణ ఎంత విలక్షణ దర్శకుడో మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ దర్శకుడు ప్రేమ కథ మూవీస్ కు పెట్టింది పేరుగా టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇలా ప్రేమకథ సినిమాలతో మంచి హిట్ లను అందుకున్న ఈ దర్శకుడు ఈ మధ్యే నాని హీరోగా తెరకెక్కిన 'టక్ జగదీష్' దర్శకత్వం వహించాడు. కానీ ఈ సినిమాతో మాత్రం దర్శకుడు శివ నిర్వాణ ప్రేమకథ సినిమాలతో చేసిన మ్యాజిక్ ను కుటుంబ కథా చిత్రాలతో చేయలేకపోయాడు అని చెప్పవచ్చు. ఈ దర్శకుడు తెరకెక్కించిన నిన్నుకోరి , మజిలీ సినిమాలు చాలా పరిణితి చెందిన ప్రేమ కథ సినిమాలు.ఈ సినిమాలతో దర్శకుడు చెప్పాలనుకున్న విషయాలను చాలా సూటిగా చెప్పి ఇటు జనాలతో పాటు అటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందాడు. కానీ అదే 'టక్ జగదీష్'  సినిమా విషయంలో మాత్రం ఈ దర్శకుడు అంతగా సక్సెస్ అవ్వలేదు అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ఈ దర్శకుడు 'టక్ జగదీష్' సినిమా తర్వాత  విజయ్ దేవరకొండ తో ఒక క్రేజీ మూవీ ని చేస్తాడు అని వార్తలు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు చూస్తే దర్శకుడు శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ తో సినిమా చేసే అవకాశాలు లేనట్లే అనిపిస్తుంది. అయితే ఈ దర్శకుడు తెరకెక్కించిన సినిమాలలో ప్రేమ కథలుగా తెరకెక్కిన రెండు సినిమాలు మంచి ప్రజా దరణ పొందడంతో తన నాలుగవ సినిమాకు కూడా ప్రేమ కథనే రాసుకున్నట్టు దర్శకుడు శివ నిర్వాణ తెలియ జేశాడు. శనివారం రోజు  సోషల్ మీడియా వేదికగా దర్శకుడు శివ నిర్వాణ ఒక వీడియో ను షేర్ చేశారు. తనకు ఎంతో ఇష్టమైన వైజాగ్ బీచ్ లో కొత్త కథను రాయడం మొదలు పెట్టాను అంటూ తెలియజేశాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: