టాలీవుడ్ లో హీరోలు ఎక్కువ అన్నది తెలిసిందే. అరవైలు దాటిన వారి నుంచి ఇరవైలలో ఉన్న వారిని అందరికీ కలుపుకుంటే పెద్ద లెక్క తేలుతుంది. సీనియర్లు, మిడిల్ ఏజ్ హీరోలు, స్టార్లు, టీనేజర్లు ఇలా చాలా మంది టాలీవుడ్ లో హీరోలుగా ఉన్నారు.

ఇదిలా ఉంటే ఇంతమందికి హీరోయిన్లు ఎక్కడ నుంచి దొరుకుతారు అన్నదే ప్రశ్న. హీరోయిన్లు స్టార్లకు కష్టం అనుకుంటే సీనియర్లకు అసలు దొరకని సీన్ ఉంది. ఈ విషయంలో టాప్ ఫోర్ సీనియర్లు సఫర్ అవుతూనే ఉన్నారు. అయితే మిల్కీ బ్యూటీ తమన్నా ఇపుడు తన రూట్ మార్చుకుంది. తన పాత్ర బాగుంటే సీనియర్లతో కూడా నటించేందుకు రెడీ అంటోంది. ఆమె ఇప్పటికే ఎఫ్ 2, ఎఫ్ 3 మూవీస్ తో చేసింది. మెగాస్టార్ చిరంజీవితో ఆమె సైరా మూవీలో చేసింది. ఇపుదు భోళా శంకర్ మూవీలో చేయడానికి రెడీ  అవుతోంది అని టాక్. అదే టైమ్ లో ఆమె మాస్ట్రో మూవీలో సీనియర్ హీరో నరేష్ పక్కన కూడా కనిపించింది.

ఇవన్నీ ఇలా ఉంటే బాలయ్యతో మరో రెండు మూవీస్ సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. అందులో ఒకటి గోపీచంద్ మలినేని డైరెక్షన్లో అయితే మరోటి అనిల్ రావిపూడిది. ఈ మూవీస్ లో హీరోయిన్ల గురించే ఇపుడు సెర్చ్ సాగుతోంది. అయితే అనిల్ రావిపూడి మూవీలో తమన్నా కోసం ట్రై చేస్తున్నారు అని టాక్ నడుస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఆమె ఇప్పటికే రెండు సినిమాలు చేసి ఉన్నారు. దాంతో బాలయ్యతో జట్టు కట్టించేందుకు అనిల్ చూస్తున్నారని టాక్. మరి బాలయ్యతో కూడా చేసేస్తే తమన్నా సీనియర్ల లిస్ట్ దాదాపుగా కంప్లీట్ చేసినట్లు అవుతుంది అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరో వైపు చూస్తే సీనియర్ హీరోయిన్లు కొందరు ఇపుడు తమ ఆలోచనలు మార్చుకుంటున్నారు. వారికి ఆఫర్లు సీనియర్ హీరోల నుంచే వస్తున్నాయి. దాంతో హీరోయిన్ల కొరత అలా తీరే అవకాశం ఉంది.
మరింత సమాచారం తెలుసుకోండి: