ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ లో ఉన్న యువ హీరోలలో పంజా వైష్ణవ్ తేజ్ ఒకరు. మెగా మేనల్లుడి గా సినిమాల్లోకి ఎంట్రీ ఈ హీరో 'ఉప్పెన' వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ అటు క్లాస్ ఇటు మాస్ ప్రేక్షకుల తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఈ సినిమా లో ఒక సాధారణ మధ్య తరగతి యువకుడి గా పంజా వైష్ణవ్ తేజ్ చేసిన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇలా మొదటి సినిమా మంచి విజయవంతం అవడం తో ఈ హీరోకు వరుస బెట్టి తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు కూడా వచ్చాయి.

అందులో భాగంగానే ఈ హీరో తెలుగు ఇండస్ట్రీ లో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తెరకెక్కిన 'కొండపొలం' సినిమా లో హీరో గా నటిస్తున్నాడు. ఈ చిత్రం చాలా వైవిధ్యభరితమైన సినిమా. ఈ మూవీ ని 'కొండపొలం' అనే ఒక ప్రముఖ నవల ఆధారంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే కొండపొలం మూవీ నుండి విడుదలైన ప్రచార చిత్రాలకు జనాలు నుండి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ పూర్తి గ్రామీణ అమ్మాయిల గొర్రెలు కాచుకునే యువతిల కనిపించబోతుంది. ఈ మూవీలో రకుల్ ‘ఓబులమ్మ’గా, వైష్ణవ్ తేజ్ ‘కటారు రవీంద్ర’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ని చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ విడుదల తేదీ గురించి ఆ ప్రకటన లో తెలియజేశారు.  కొండపొలం మూవీ ట్రైలర్ ను వచ్చే సోమవారం సాయంత్రం 3.33 గంటలకు విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు క్రిష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: