నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'అఖండ'.బాలయ్య సరసన యంగ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా, పూర్ణ ఓ కీలక పాత్రలో కనిపించనుంది.ఇక ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు నందమూరి అభిమానులు.ఇక ఇదిలా ఉంటె ఈ సినిమా దసరా కానుకగా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతూ..

 అఖండ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నామని చెప్పుకొచ్చారు.అయితే దసరాకు సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అఖండ మేకర్స్ నుండి ప్రకటన రాకపోవడంతో దసరా బరిలో బాలయ్య లేనట్టేనని తెలుస్తోంది.అక్టోబర్ 8 న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విడుదల కానుండగా..అక్టోబర్ 14 న మహాసముద్రం,అలాగే అక్టోబర్ 15 వ తేదీన రౌడీ బాయ్స్ సినిమాలు విడుదల కానున్నాయి.ఇక ఈ సినిమాలతో పాటు అక్టోబర్ 15 వ తేదీన నాగశౌర్య నటించిన వరుడు కావలెను సినిమా కూడా రిలీజ్ కానుంది.ఆర్ ఆర్ ఆర్ దసరాకు రిలీజ్ కాదని మేకర్స్ ప్రకటించడంతో చిన్న హీరోల సినిమాలు,మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు దసరాకు క్యూ కట్టాయి.

అఖండ దసరా సీజన్ ను మిస్ చేసుకుంటే మరో మంచి డేట్ దొరకడం అంత ఈజీ కాదు.ఈఈ నేపథ్యంలో ఆచార్య, అఖండ సినిమాల రిలీజ్ డేట్స్ కి సంబంధించి ఓ క్లారిటీ వస్తే బాగుంటుందని చిరు, బాలయ్య అభిమానులు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఇక ఆచార్య సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది.ఈ సినిమా కూడా దసరాకు రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్న.. ఇంకా మేకర్స్ మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు.ఏదేమైనా ఆచార్య సంగతి పక్కన పెడితే బాలయ్య అఖండ మాత్రం దసరా బరి నుండి తప్పుకున్నట్లే అనే వార్తలు ఇండ్రస్టీ లో గట్టిగా వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: