తెలుగు ఇండస్ట్రీ లో ఎంతో మంది అందగత్తెలు ఉన్నారు. అందులో కొందరు తమ అందంతో స్టార్ హీరోయిన్లు గా మారితే, మరికొంతమంది తమ నటనతో, తమ హావభావాలతో స్టార్ హీరోయిన్లుగా మారినవాళ్లు ఉన్నారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ లుగా కొనసాగుతున్న వారిలో చాలా మంది హీరోయిన్లు మొదట పరాజయాలను చూసి ఆ తర్వాత విజయవంతమైన సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారిన వారు ఉన్నారు. మరి కొంత మంది మాత్రం మొదటి సినిమాలతోనే విజయాలను సాధించి స్టార్ హీరోయిన్లుగా మారినవాళ్లు ఉన్నారు. ఇలా మొదటి సినిమాతో ఇండస్ట్రీలో పరాజయాన్ని ఎదుర్కొని ఆ తర్వాత మంచి విజయాలతో స్టార్ హీరోయిన్ రేసులో ముందున్న హీరోయిన్లలో ఒకరు క్యూట్ అండ్ హాట్ బ్యూటీ నభా నటేష్. సుధీర్ బాబు హీరోగా నటించిన 'నన్ను దోచుకుందువటే' మూవీతో క్యూట్ అండ్ హాట్ బ్యూటీ నభా నటేష్ తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ మూవీ ఈ బ్యూటీకి పెద్ద గా అవకాశాలను తెచ్చి పెట్టలేకపోయింది. ఆ తర్వాత 'ఇస్మార్ట్ శంకర్' మూవీ తో మంచి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ తెలుగు స్టార్ హీరోయిన్ గా ఎదిగే దశలో ముందుకు దూసుకుపోతోంది.

ఇలా ముందుకు దూసుకుపోతున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటూ అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా తన అభిమానులతో తన డైలీ ఆక్టివిటీస్ ను పంచుకుంటూ, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. ఇలా సినిమాలతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులతో టచ్ లో ఉండే నభా నటేష్ అప్పుడప్పుడు తన అందచందాలను ప్రదర్శిస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ తన అభిమానుల తో పాటు కుర్రకారును వేడెక్కిస్తు ఉంటుంది. అయితే తాజాగా కూడా ఈ క్యూట్ అండ్ హాట్ బ్యూటీ కొన్ని ట్రెడిషనల్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో నభానటేష్ సాంప్రదాయబద్దంగా కంచిపట్టు చీర కట్టుకొని, నీలిరంగు బ్లౌజ్ ధరించి, నడుముకు వడ్డాణం, మెడలో నక్లెస్ పెట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని నభానటేష్ దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: