టాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరో హీరోయిన్ లు గా ఉన్న అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన చిత్రం లవ్ స్టోరీ నిన్న ప్రేక్షకుల ముందుకు రాగా బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ తో దూసుకు పోతుండగా ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా తన సత్తా చాటుతూ ప్రేక్షకులను మెప్పిస్తూ భారీ వసూళ్లు తో దూసుకుపోతుంది. ప్రధానంగా అమెరికా బాక్సాఫీసు వద్ద ఈ సినిమాకు భారీ స్పందన వ్యక్తం అవుతుంది.

తొలిరోజే ఈ సినిమా ప్రీమియర్ షో ల రూపంలో రికార్డు స్థాయిలో వసూలు రాబట్టి ఈ చిత్రం రెండవ రోజు కూడా భారీగానే ప్రేక్షకులను అలరిస్తూ భారీ వసూళ్లను వసూలు చేసింది. అయితే ఈ వారాంతంలో ఈ సినిమా మరో మైలురాయిని అధిగమించే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తొలిరోజు కలెక్షన్ల భారీగా సాధించిన రికార్డును నెలకొల్పిన లవ్ స్టోరీ ఒకరోజు 306k అమెరికన్ డాలర్లు వసూలు చేసుకుని అందరినీ షాక్ కి గురి చేసింది.

రెండో రోజు కూడా ఏ మాత్రం తగ్గకుండా దాదాపు 290k అమెరికన్ డాలర్ వసూళ్లను నమోదు చేసింది.  దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల ఆదరణ స్పష్టంగా కనిపిస్తుంది రెండు రోజులు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు భారీ వసూళ్లు చేయడంతో 500k అమెరికన్ డాలర్లను వసూలు చేసిన సినిమాగా నిలిచిపోయింది. ఈ రెండు రోజుల్లోనే ఈ రేంజ్ లో సాధించడం అంటే సూపర్ హిట్ అని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరి భవిష్యత్తులో ఈ సినిమా ఏ రేంజ్ లో రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.  తొలి వారాంతం రోజుల్లోనే లాభాల్లోకి ఈ సినిమా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఆలస్యమైన ఈ సినిమా సూపర్ హిట్ ను అందుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: