అక్కినేని అఖిల్ తొందర్లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అక్కినేని నాగార్జున కుమారుడిగా తెలుగు సినిమాలలోకి చిన్న వయసులోనే సిసింద్రీ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించిన అఖిల్ సుదీర్ఘ విరామం తర్వాత అఖిల్ అనే కమర్షియల్ చిత్రంలో హీరోగా నటించి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమాతో సరైన హిట్ కొట్టని అఖిల్ ఆ తర్వాత హలో మిస్టర్ మజ్ను అనే రెండు సినిమాల్లో నటించాడు.

అవి కూడా ప్రేక్షకులను నిరాశ పరచడంతో ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయినా కూడా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధం చేసుకుంది. ఇటీవలే అక్టోబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఉన్న కారణాలవల్ల అక్టోబర్ 15వ తేదీకి వాయిదా వేసినట్లు చిత్రబృందం వెల్లడిస్తుంది.

అక్కినేని అఖిల్ అన్నయ్య అక్కినేని నాగ చైతన్య తన సినిమా లవ్ స్టోరీ ను పోస్ట్ ఫోన్ చేసి చేసి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి భారీ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో పలు మార్లు విడుదల వాయిదా అవుతూ వచ్చినా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా ఆ రేంజ్ లోనే సూపర్ హిట్ అందుకుంటుందా అనేది చూడాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించగా అక్కినేని అభిమానులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అఖిల్ తొలి హిట్ కొడితే చూడాలని అందరూ ఎంతగానో భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: