టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొంత మంది దర్శకులు తమ తమ చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి పేరుతో పాటు వారి మనసుల్లో ఎంతగానో ముద్ర వేసుకున్నారు. ఆయా చిత్రాల పేర్లు చెబితే వెంటనే ఆ దర్శకుల బయోగ్రఫీ మొత్తం ప్రేక్షకుల మదిలో మెదులుతూ ఉంటుంది. ఆ విధంగా తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటివరకు మంచి మంచి చిత్రాలతో ప్రేమ కథా చిత్రాలతో అందరినీ ఆకట్టుకున్నాడు దర్శకుడు శివ నిర్వాణ. నిన్ను కోరి సినిమాతో ప్రేక్షకులను ప్రేమలో ఊయలలు ఊగించిన ఈ దర్శకుడు తొలి సినిమా తోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు.

ఇక రెండో సినిమా గా నాగచైతన్య తో మజిలీ అనే చిత్రం చేయగా ఆ చిత్రం కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది సూపర్ హిట్ కొట్టడం తో ఈ దర్శకుడికి ఎదురు లేకుండా పోయింది.  ఈ నేపథ్యంలోనే ఆయన తన మూడవ సినిమాను తనకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన నానితో కలిసి టక్ జగదీష్ అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమా విమర్శల పాలు కావడం విడుదల ఆలస్యం కావడం వల్ల క్రేజ్ భారీ గా తగ్గిపోయింది. అమెజాన్ ప్రైమ్ లో చివరికి విడుదల చేశారు చిత్రాన్ని.

అయితే ఈ చిత్రం తో ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాడు శివ నిర్వాణ. ఈ సినిమా అత్యంత దారుణం గా ఉందనే విమర్శలు రాగా శివ నిర్వాణ పై నాని అభిమానులు ఎన్నో విమర్శలు చేశారు. దాంతో ఇప్పుడు మరొక హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఈ దర్శకుడికి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆయన తన తదుపరి చిత్రాన్ని మళ్లీ లవ్ జోనర్ లోనే చేయాలని భావించాడు. టక్ జగదీష్ తన జోనర్ కాకుండా వేరే జోనర్ కావడం వల్లే హిట్ కాలేదని భావించి ఇప్పుడు ప్రేమ కథ చిత్రం చేసి మళ్లీ హిట్ సంపాదించాలని భావిస్తున్నాడు. మరి ఈసారి ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తాడో అనేది చూడాలి. అక్కినేని నాగ చైతన్య తో తదుపరి చిత్రాన్ని చేయాలని భావిస్తున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఇటీవలే శివ నిర్వాణ తో ఓకే చేసిన సినిమాను క్యాన్సిల్ చేసుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: