ప్రభాస్ హీరోగా ప్రస్తుతం నాలుగు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. వీటిలో రాధే శ్యామ్ చిత్రం మొదటగా విడుదలవుతుండగా ఆ తర్వాత సలార్ ఆది పురుష్ ప్రాజెక్ట్ కే సినిమాలు విడుదల కానున్నాయి. ప్రస్తుతం వీటికి డేట్లు కేటాయించి ఈ నాలుగు సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్న ప్రభాస్ ఆ తర్వాత కూడా కొన్ని సినిమా లను లైన్లో పెట్టే విధంగా గా ప్రణాళికలు వేస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే వృందావన అనే పేరుతో ఓ సినిమాను దిల్ రాజు నిర్మాణంలో ఓకే చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా మరొక సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసే విధంగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ సలార్ అనే సినిమాను చేస్తున్నాడు. కేజిఎఫ్ సినిమా తో దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ రెండో భాగాన్ని పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేయగా ప్రభాస్ తో సినిమా ను మొదలు పెట్టి పూర్తి చేయాలని ప్రశాంత్ భావించి ఆ సినిమాను మొదలు పెట్టేసాడు.


శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దాదాపు 70 శాతం పూర్తయిందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాను కూడా పూర్తి చేసి మళ్లీ ప్రభాస్ తోనే మొదలు పెట్టే విధంగా ఆయన ప్రణాళికలు చేస్తున్నాడట. ప్రభాస్ తో వీలైతే ప్రభాస్ లేదంటే ఎన్టీఆర్ తో తాను కమిట్ అయిన సినిమాను మొదలుపెట్టాలి అని చూస్తున్నాడు ప్రశాంత్. ఏదేమైనా ప్రభాస్ తో మరో సినిమా చేయడం మాత్రం గ్యారెంటీ అని మాత్రం అర్థం అవుతుంది. ఈ నేపథ్యంలో మొదటి సినిమా సలార్ వచ్చిన తర్వాత ఆ సినిమా తాలూకు ప్రభావం వారి తదుపరి సినిమా పై తప్పకుండా పడుతుంది. మరి ఈ సూపర్ హిట్ కాంబో నుంచి రెండు సినిమాలు వస్తున్న నేపథ్యంలో అవి ఏ రేంజ్ లో హిట్ అవుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: