కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమా తో మినీ కాజల్ గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుని తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా సెట్ అయిపోయిన హీరోయిన్ మెహరిన్.  తొలి సినిమాలో అందం అభినయంతో ఆకట్టుకున్న ఈమె తదుపరి చిత్రాన్ని శర్వానంద్ సరసన చేసి వరుసగా రెండు హిట్లు అందుకుంది. రాజా ది గ్రేట్ తో ఆమె మంచి పేరు సంపాదించుకును హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది.  తెలుగులో వరుస సక్సెస్ లు సాధిస్తున్న క్రమంలోనే తమిళ హిందీ భాషల్లో కూడా ఆమె అరంగేట్రం చేసి అక్కడ నిలదొక్కుకునే ప్రయత్నం చేసింది.

అయితే అక్కడ ఆమెకు పెద్దగా పేరు రాకపోవడంతో మళ్ళీ తెలుగులో సినిమాలు చేయడం ప్రారంభించింది. అలా ఆమె కేరాఫ్ సూర్య, జవాన్, పంతం, నోటా, కవచం వంటి సినిమాలలో చేయగా అవి భారీ ఫ్లాపులు గా నిలిచాయి.  ఇలా ఆమె సినిమా ల ఎంపిక లోపం స్పష్టంగా తెలుస్తుంది. తన పాత్రకు ఇంపార్టెన్స్ లేని సినిమాలలో నటిస్తూ ఆమె గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకునే క్రమంలో అన్ని ఫ్లాప్ సినిమాలు చేసి భారీ ఫ్లాప్ లను అందుకుంది. కానీ ఆమె కెరీర్ నిలబెట్టిన సినిమా f2 అని చెప్పాలి.

ఆ చిత్రంలో ఆమె నటించిన హనీ పాత్ర ప్రేక్షకులలో మంచి గుర్తింపు దక్కింది. నిజానికి ఆమె పాత్రకు అందరూ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆ చిత్రంకు కొనసాగింపు గా చేస్తున్న f3 చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఈసారి మళ్లీ తనకు మంచి పేరు తీసుకు వస్తుందని భావిస్తుంది మెహ్రీన్. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మంచిరోజులొచ్చాయి సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈమె ఇప్పుడు గోపీచంద్ హీరోగా నటిస్తున్న పక్కా కమర్షియల్ చిత్రంలో కూడా హీరోయిన్ గా ఎంపికైంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే కనుక నిజమైతే ఆమె కెరీర్ మళ్లీ పుంజుకుందనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: