పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటన కన్నా అయినా ప్రి రిలీజ్ ఫంక్షన్ లో ఇచ్చే స్పీచ్ లకి ఫాన్స్ ఫిదా అయిపోతారు. ఆయన మాటల్లో ఉండే పవర్ ఎవరినైనా కదిలిస్తుంది.ఇప్పుడు అలాంటి పవర్ ఫుల్ స్పీచ్ మళ్ళీ ఒకటి పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రి రిలీజ్ ఫంక్షన్ లో ఇచ్చారు. సాయి ధరమ్ తేజ్ ఈమద్యనే ఆక్సిడెంట్ జరగడంతో ఆయన రిపబ్లిక్ ఫంక్షన్ కి పవన్ అతిథిగా వచ్చారు. ఈ ప్రి రిలీజ్ ఫంక్షన్ లో ఆయన జగన్ ప్రభుత్వం మీద విరుచుకు పడ్డారు. ఈమధ్యనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా కలెక్షన్స్ మీద పెట్టిన నిఘా మీద పవన్ జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేసారు.

దిల్ రాజు ని అసలు నాతో వకీల్ సాబ్ ఎందుకు తీశారు ,నా వల్ల ఆంధ్ర ప్రదేశ్ సినీ నిర్మాతల్ని టార్గెట్ చేస్తున్నారు అని ఆయన ఆవేదనని వెళ్లబుచ్చాడు. అలాగే సాయి ధరమ్ తేజ్ ఆక్సిడెంట్ మీద టీవీ చానెల్స్ వేసిన కధనాలు మీద కూడా పవన్ స్పందించాడు. సినిమావాళ్ళమీద కొంచెం కనికరం చూపించండి అని మేము కూడా మనుషులమే అని అన్నారు. టీవీ చానెల్స్ ఇలాంటి కధనాలు చెప్పడం కన్నా వై ఎస్ వివేకానంద రెడ్డి ఎలా చనిపోయారు అని , కోడికత్తి ఘటన ఇప్పుడు ఏమైంది , అమాయకమైన చిన్న పాపా చరిత మరణం లాంటి కేస్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ పెడితే మంచిది అని ఆయన అన్నారు.

 ఈ ప్రి రిలీజ్ ఫంక్షన్ లో పవన్ మాట్లాడిన విధానం ఆయన రాజకీయ సభలని గుర్తు చేసింది. ముఖ్యంగా సినిమా వాళ్ళమీద జగన్ ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడి మీద పవన్ కళ్యాణ్ సీరియస్ గా స్పందించారు. పవర్ లేని వాడిని పవర్ స్టార్ ని ఎలా అవుతాను అని పవన్ కళ్యాణ్ తన మీద తానే పంచ్ వేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: