అక్కినేని నాగార్జున ప్రస్తుతం రెండు సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ది ఘోస్ట్ అనే చిత్రాన్ని చేస్తుండగా ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 50 శాతం షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమాకు సంబంధించి న ఫస్ట్ లుక్ ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం విడుదల చేయగా ఫస్ట్ లుక్ కి ప్రేక్షకులు ఎంతగానో స్పందించారు. నాగార్జున చాలా రోజుల తర్వాత ఓ వెరైటీ గెటప్ లో వెరైటీ సినిమాలో చూడబోతున్నాం అనే ఆనందం అక్కినేని అభిమానులలో నెలకొంది.

ఇక నాగార్జున నటిస్తున్న మరొక సినిమా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు అనే సినిమా. ఆయన హీరోగా చేసిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభం కాగా ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అక్కినేని నాగచైతన్య కూడా హీరోగా నటిస్తున్నాడు. కృతి శెట్టి ఆయనకు జోడీగా నటిస్తుంది.  గత కొన్ని సినిమాలు అందుకుంటూ వస్తున్న నాగార్జున ఈ సినిమాలతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్లోకి రావాలని భావిస్తున్నాడు.

ఓవైపు తన తోటి సీనియర్ హీరోలు వరుస సినిమాలు హిట్ లు చేసుకుంటూ ఉంటే తాను మాత్రం ఇలా వెనుక పడిపోవడం ఆయన అభిమానులు ఏమాత్రం నచ్చలేదు అందుకే ఇప్పుడు కథలతో విభిన్నమైన దర్శకులతో సినిమాలు చేసే వారిని ఎంచుకొని హిట్ కొట్టే విధంగా నాగార్జున ఆలోచిస్తున్నాడు ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్గా ఉన్న కాజల్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో ఆమె స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇలియానా, త్రిష లను పరిశీలించిన పాన్ ఇండియా రేంజ్ లో చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తూ ఉండడంతో ఈ విధంగా చిత్ర బృందం ఆలోచిస్తుందని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: