యువ నటుడు నాగ చైతన్య, యువ నాయిక సాయి పల్లవి ల కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల తీసిన ఈ సినిమాని ఏషియన్ సినిమాస్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి సంస్థలు నిర్మించగా ఈ ప్రతిష్టాత్మక మూవీకి యువ మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సంగీతం అందించాడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్, ట్రైలర్ అన్ని కూడా ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి.

ఇక రెండు రోజుల క్రితం ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ని దక్కించుకుంది. ఆకట్టుకునే కథ, కథనాలతో మధ్యతరగతి జంట మధ్య సాగె హృద్యమైన ఎమోషన్స్ కలగలిపిన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి బాగానే రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ మూవీపై ఇప్పటికే పలువురు ఆడియన్స్ తో పాటు సినిమా ప్రముఖులు కూడా మంచి ప్రశంసలు కురిపిస్తుండగా కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా వేదికల ద్వారా లవ్ స్టోరీ మూవీ యూనిట్ పై పొగడ్తల జల్లు కురిపించారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. కొద్దిసేపటి క్రితం లవ్ స్టోరీ మూవీ చూసాను, నిజంగా శేఖర్ గారు ఎంతో అద్భుతంగా తీశారు.

 

నాకు ఎంతో బాగా నచ్చింది, ముఖ్యంగా హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి ఇద్దరూ కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. ప్రతి ఫ్రేమ్ ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా శేఖర్ గారు తీస్తే, దానిని మరింతగా వారికి చేరువ చేసేలా సంగీత దర్శకుడు పవన్ అందించిన సంగీతం, బీజీఎమ్ మరింతగా ఆకట్టుకున్నాయి అంటూ సూపర్ స్టార్ మహేష్ తన ట్విట్టర్ ద్వారా పెట్టిన పోస్టులు ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ఇక రెండవ రోజు కూడా మంచి హవాతో కొనసాగుతున్న ఈ లవ్ స్టోరీ మూవీ రాబోవు రోజుల్లో ఎంత మేర దూసుదుకెళ్తుందో చూడాలి.


 

మరింత సమాచారం తెలుసుకోండి: