సాయి ధరమ్ తేజ్ హీరోగా.. దేవ్ కట్టా దర్శకత్వంలో రూపొందిన చిత్రం రిపబ్లిక్. హైదరాబాద్ లో ప్రీరిలీజ్ వేడుక జరిగింది. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో.. ఆ లోటును భర్తీ చేసేందుకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదం గురించి ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్.. తాను తొలిసారిగా తేజ్ ఫంక్షన్ కు వచ్చినట్టు చెప్పుకొచ్చారు. తేజ్ స్వయంగా పైకి రావాలనే తాము వారి సినిమా ప్రమోషన్ లకు రాలేదని స్పష్టం చేశారు. నిర్మాతలు ఎంతో ఖర్చు పెట్టి సినిమా తీశారనీ.. వాళ్లు ఆనందంగా ఉండాల్సిన సమయంలో తేజ్ మోటార్ బైక్ యాక్సిడెంట్ భారిన పడటం చాలా బాధాకరమైన విషయం అన్నారు పవన్ కళ్యాణ్. సాయిధరమ్ తేజ్ కు అభిమానుల ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

ఇక తేజ్ యాక్సిడెంట్ గురించి కొన్ని కథనాలు రావడం చాలా బాధకు గురిచేసినట్టు చెప్పారు పవన్ కళ్యాణ్. రోడ్డుపై ఇసుక ఉన్న కారణంగా కింద పడిపోతే బాధపడాల్సింది పోయి.. రకరకాలుగా కథలు అల్లారని ఆవేదన వ్యక్తం చేశారు. అలా కథనాలు అల్లే వారి పట్ల కనికరం చూపించండని అభిమానులను కోరారు పవర్ స్టార్. తేజ్ ప్రేక్షకుల ఆనందాన్ని కోరుకునే వాడని గుర్తు చేశారు. రిపబ్లిక్ చిత్రం సామాజిక స్పృహతో తీశారని స్పష్టం చేశారు. సినిమాల్లో విలువలు మాట్లాడటం చాలా సులువు.. కానీ నిజ జీవితంలో చాలా కష్టమన్నారు పవన్.

అటు సాయి ధరమ్ తేజ్ సినిమా గురించి మాట్లాడుతూనే పొలిటికల్ పంచ్ లు పేల్చారు పవన్ కళ్యాణ్. చూపించాల్సింది సాయి ధరమ్ తేజ్ గురించి కాదనీ.. వైఎస్ వివేకా హత్య, కోడికత్తి, ఆరేళ్ల చిన్నారి చరిత గురించన్నారు. అదే సమాజానికి పనికొచ్చేదిగా చెప్పుకొచ్చారు. అటు వైష్ణవ్ తేజ్ సైతం.. తన అన్నయ్య కోలుకుంటున్నట్టుగా చెప్పారు. అందరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు.




































మరింత సమాచారం తెలుసుకోండి: