తెలుగు సినిమా పరిశ్రమకి స్మార్ట్ హీరో సిద్దార్థ హీరోగా తెరకెకెక్కిన అనగనగా ఓ ధీరుడు మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు కమల్ హాసన్ పెద్ద కూతురు శృతి హాసన్. అయితే అప్పట్లో మంచి అంచనాలతో ప్రేక్షకు ముందుకు వచ్చిన ఆ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు. అనంతరం ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ మూవీ ఛాన్స్ కొట్టిన శృతి, ఆ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టారు. అక్కడి నుండి మరింతగా అవకాశాలతో దూసుకెళ్లిన శృతి హాసన్ తరువాత సూపర్ స్టార్ మహేష్ తో కొరటాల శివ తీసిన శ్రీమంతుడు మూవీలో యాక్ట్ చేసారు.

సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన ఈ సినిమా అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టిన విషయం తెల్సిందే. అయితే తొలిసారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో శృతి హాసన్ చేసిన సినిమా రామయ్య వస్తావయ్యా మాత్రం బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలయింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాని హరీష్ శంకర్ తీయగా థమన్ సంగీతం అందించారు. ఇక ఆ ముగ్గరు స్టార్ హీరోల తరువాత యంగ్ స్టార్ హీరోస్ ఆపై అల్లు అర్జున్ తో రేసు గుర్రం మూవీ, చరణ్ తో ఎవడు మూవీస్ చేసి మరొక రెండు సూపర్ హిట్స్ కొట్టిన శృతి హాసన్ ప్రస్తుతం తొలిసారిగా రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ మూవీలో ఆయన సరసన జోడీ కడుతున్నారు.

ప్రశాంత్ నీల్ తీస్తున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీని హోంబలె ఫిలింస్ వారు ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తుండగా భువన గౌడ కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తున్నారు. కొన్నాళ్లుగా షూటింగ్ వేగవంతంగా జరుగుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచి యాక్షన్ తో కూడిన మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో ప్రభాస్ తో హీరోయిన్ శృతి పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, తప్పకుండా తొలిసారిగా డార్లింగ్ తో కలిసి శృతి చేస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని ఇన్నర్ వర్గాల టాక్. మరి మహేష్ తో అలానే పవన్ తో సూపర్ హిట్స్ కొట్టి, ఎన్టీఆర్ తో ఫ్లాప్ చవిచూసిన శృతి, ప్రభాస్ తో ఏ రేంజ్ మూవీ అందుకుంటారో తెలియాలి అంటే మరికొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: